Asianet News TeluguAsianet News Telugu

కాంపిటీషన్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియాకు రూ. 1,337 కోట్ల జరిమానా చెల్లించిన గూగుల్..కారణం ఇదే..

ఆండ్రాయిడ్ కేసులో టెక్ దిగ్గజం గూగుల్ రూ.1337.76 కోట్ల జరిమానా చెల్లించింది. గూగుల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జరిమానా చెల్లించింది. దేశంలోనే ఓ ప్రముఖ టెక్ కంపెనీ జరిమానా చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Competition Regulator of India Google paid a fine of 1,337 crore this is the reason MKA
Author
First Published May 3, 2023, 2:22 AM IST

గ్లోబల్ కార్పోరేట్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు రూ.1,337.76 కోట్ల జరిమానాను కాంపిటీషన్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి చెల్లించింది. ఆండ్రాయిడ్ కేసులో సీసీఐ ఈ జరిమానా విధించడం విశేషం. కాగా ఒక పెద్ద టెక్ కంపెనీ భారతీయ రెగ్యులేటర్‌కు ఇంత భారీ జరిమానా చెల్లించడం ఇదే తొలిసారి. భారత ప్రభుత్వం కొత్త డిజిటల్ ఇండియా చట్టాన్ని అమలు చేస్తోంది, దీనిని ఉల్లంఘించినందుకు గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఈ భారీ జరిమానా విధించింది.

గూగుల్ మొత్తం జరిమానా మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఖాతాలో జమ చేసిందని ప్రముఖ వార్తా ఏజెన్సీ తెలిపింది. దీనిపై కంపెనీ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT)లో ఇప్పటికే అప్పీల్ చేసింది. అక్కడ గూగుల్ కేసు ఓడిపోయిన తర్వాత, 30 రోజుల్లో జరిమానాను చెల్లించింది. అక్టోబరు 2022లో, ఆండ్రాయిడ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలపై భారతీయ మార్కెట్ నియంత్రణ సంస్థ గూగుల్‌కు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే CCI సూచించినట్లు ఆండ్రాయిడ్ విషయంలో నియమాలను పాటిస్తామని 2023 ప్రారంభంలో గూగుల్ చెప్పింది.

జరిమానా చెల్లించడంతో పాటు, భారతదేశంలో మారిన నిబంధనలను దృష్టిలో ఉంచుకుని,   ఇకపైమొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌ ఇకపై యాప్స్ కు సంబంధించిన అన్ని నిబంధనలను అనుసరిస్తుందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది . మేము CCI ఆదేశాలకు మాత్రమే కట్టుబడి ఉంటామని తెలిపింది. 

CCI కాంపిటీషన్ కమీషన్  నిర్ణయంలో తప్పులున్నాయని పేర్కొంటూ పెనాల్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ గూగుల్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు గూగుల్ వాదనలను తిరస్కరించింది. అంతేకాదు  నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను సమర్థించింది. ఈ ఉత్తర్వుతో పాటు 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో పాటు మార్చి 31లోపు NCLATలో అప్పీల్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గూగుల్‌ను కోరింది. ఇదిలా ఉండగా, ఆండ్రాయిడ్ కోసం CCI మార్గదర్శకాలను అనుసరిస్తామని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రకటించింది.

మరోవైపు యూరోపియన్ కోర్టు ఆదేశాల కాపీని CCI దొంగిలించిందని కూడా Google కూడా ఆరోపించింది. పూర్తి ఆధారాలు లేకుండానే సీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ పేర్కొంది. అయితే CCI ఈ క్రమలోనే Googleకి మరో రూ. 936 కోట్ల జరిమానా విధించింది, ప్లే స్టోర్ పాలసీలలో దాని ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకున్నందుకు దోషిగా తేల్చింది. ఇదిలా ఉంటే Google ఇప్పుడు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ADIF)తో కలిసి పనిచేయడానికి అంగీకరించింది.

గూగుల్ చేసిన తప్పేంటి..?
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అన్ ఇన్ స్టాల్ చేయలేని విధంగా దాని స్వంత అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడం గూగుల్ చేసిన ప్రధాన తప్పులలో ఒకటి. ఆండ్రాయిడ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, Google యాజమాన్యంలో ఉంది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ తన స్వంత అప్లికేషన్‌లను కూడా ముందే ఇన్‌స్టాల్ చేస్తుంది. దీని ద్వారా గూగుల్ తన పోటీదారుల కంటే పోటీ ప్రయోజనాన్ని పొందిందని CCI ఇంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇది కాకుండా కాంపిటీషన్ కమిషన్ మరో కేసులో గూగుల్‌కు జరిమానా విధించింది. మార్కెట్‌లో తన ఆధిపత్య స్థానాన్ని కొనసాగించేందుకు ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి తప్పుడు పనులు చేసినట్లు గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios