దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ, బిఎస్‌ఇ సెన్సెక్స్‌లు తీవ్ర ఒడిదుడుకుల అనంతరం చివరకు  లాభాల్లో ముగిశాయి.  నిఫ్టీ 50 ఇండెక్స్ 19,400 పైన స్థిరపడింది,

ఉదయం  నుంచి నష్టాలను రికవరీ చేస్తూ సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో ముగిసింది.  నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఔట్ పెర్ఫార్మ్ చేయగా, రంగాలవారీగా, బ్యాంక్ నిఫ్టీ 1.1 శాతం లాభపడింది. PSU బ్యాంకింగ్ స్టాక్‌లు లాభపడ్డాయి.  హిందాల్కో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లపై ఇంట్రాడేలో 1 శాతం పైగా పెరిగినప్పటికీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ డ్రాగ్ చేసిన నిఫ్టీ మెటల్ సూచీ నష్టాల్లో ముగిసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా మూడోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్ లో  ముగిసింది సెన్సెక్స్ 213.27  పాయింట్లు లాభపడి 65,433.30 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 47.55 పాయింట్లు లాభపడి 19,444 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు  Hindalco Indus, Axis Bank Ltd, ICICI Bank, SBI, L&T షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. అలాగే Adani Enterprises, Adani Ports & Speci, Sun Pharma, Bharti Airtel, Tata Motors Ltd షేర్లు టాప్ లూజర్లుగా ఉన్నాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్మ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జియో ఫైనాన్షియల్ సర్వీసెస్- జెఎఫ్‌ఎస్‌ఎల్) స్టాక్ మూడో రోజు కూడా బ్రేక్ డౌన్ అయింది. స్టాక్‌లో వరుసగా 3 రోజులు లోయర్ సర్క్యూట్ కనిపిస్తోంది. ఈరోజు ఆగస్టు 23న షేరు 5 శాతం పతనమై రూ.227కి చేరుకుంది. అంతకుముందు ఆగస్ట్ 21న, లిస్టింగ్ రోజున కూడా ఈ స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.251.75 వద్ద ముగిసింది. ఆగస్టు 22న 5 శాతం పడిపోయి రూ.239 వద్ద ముగిసింది. స్టాక్ పతనంతో జియో ఫైనాన్షియల్ మార్కెట్ క్యాప్ రూ.1,44,378.38 కోట్లకు పడిపోయింది. వాల్యుయేషన్ పరంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ తర్వాత ఇది దేశంలో మూడవ అతిపెద్ద NBFC అయినప్పటికీ ఈ స్టాక్ లిస్టింగ్ స్థాయి నుంచి పతనం అవుతోంది. 

అదరగొట్టిన అదానీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి (ఏప్రిల్-జూన్) త్రైమాసికంలో గౌతమ్ అదానీ గ్రూప్ పన్నుకు ముందు లాభం (EBITDA) వార్షిక ప్రాతిపదికన 42 శాతం పెరిగింది. బుధవారం ఈ సమాచారాన్ని అందజేస్తూ, తమ ఎయిర్‌పోర్ట్ టు పవర్ , సీ పోర్ట్ రంగాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని గ్రూప్ తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పన్నుకు ముందు రూ. 23,532 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు అదానీ గ్రూప్ ఆ ప్రకటనలో తెలిపింది. 

వొడాఫోన్ ఐడియా: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ సెప్టెంబరు నాటికి ప్రభుత్వానికి దాదాపు రూ. 2,400 కోట్ల బకాయిలను చెల్లించాలని యోచిస్తోందని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.  

పిరమల్ ఎంటర్‌ప్రైజెస్: రూ. 3,000 కోట్ల వరకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సిడి) పబ్లిక్ ఇష్యూకి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు కంపెనీ తెలిపింది.