Closing Bell: ఫ్లాటుగా ప్రారంభమై ఫ్లాటుగానే ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు...19400 పాయింట్ల దిగువనే నిఫ్టీ..
మంగళవారం భారత బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ చివర్లో సెన్సెక్స్ 3.94 పాయింట్లు పెరిగి 65,220.03 వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు పెరిగి 19,396.50 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు 2150 షేర్లు పురోగమించగా, 1390 షేర్లు క్షీణించాయి.124 షేర్లు వాటి స్థానం మారలేదు.
స్టాక్ మార్కెట్ ఈ వారంలో రెండో రోజు ఫ్లాట్ గా ముగిసింది. BSE SENSEX సూచీ 3.94 పాయింట్ల లాభంతో 65,220 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే మరో దేశీయ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ NIFTY సూచీ 2.85 పాయింట్ల లాభంతో 19,396 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 19400 పాయింట్ల దిగువన ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ సైతం నష్టాల్లో ముగిసింది.
టాప్ గెయినర్స్ విషయానికి వస్తే Adani Enterprises +2.21 శాతం, HDFC Life Insurance +1.71 శాతం, ITC Ltd +1.44 శాతం, NTPC +1.33 శాతం, Hero MotoCorp +0.86 శాతం లాభం పొందాయి. అలాగే టాప్ లూజర్స్ విషయానికి వస్తే Bharat Petroleum -1.46 శాతం, Cipla -1.04 శాతం, Bajaj Finserv Ltd. -0.71 శాతం, Eicher Motors -0.66 శాతం, Tata Consultancy -0.57 శాతం నష్టాలతో ముగిశాయి.
వరుసగా రెండో రోజు నష్టాల్లో జియో ఫైనాన్షియల్ సర్వీసు…
ఇటీవల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్ లో క్షీణిస్తూనే ఉంది. మంగళవారం కూడా కంపెనీ స్టాక్ లోయర్ సర్క్యూట్‌ను తాకి లాక్ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) స్టాక్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. కంపెనీ షేర్ల లిస్టింగ్ కోసం నిపుణులతో సహా ఇన్వెస్టర్లందరూ ఎదురుచూశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడిపోయిన ఆర్థిక సేవల సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో రూ. 265, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 262 వద్ద లిస్ట్ అయ్యాయి.
సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో రూ.265 వద్ద లిస్టయిన కంపెనీ షేరు 5 శాతం పతనమై రూ.251.75 వద్ద ముగిసింది.అయితే JFSL కంపెనీ షేర్ల క్షీణత వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మధ్యాహ్నం 2:25 గంటలకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 5 శాతం తగ్గి రూ.236.45 వద్ద ముగిశాయి. దీంతో, ముఖేష్ అంబానీకి చెందిన ఈ కొత్త కంపెనీ స్టాక్ వరుసగా రెండు రోజుల్లో 10 శాతం పడిపోయింది.
మొదటి 10 రోజులు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలో ఉన్నాయి.తాజాగా , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ మార్కెట్‌లో ఇటీవల లిస్టెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 6.66 శాతం వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం, ప్రమోటర్ గ్రూప్ (అంబానీ కుటుంబం) కంపెనీలో 46 శాతం వాటాను కలిగి ఉంది.