Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు, 150 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్లో లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 19,550 దాటింది ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, ఐటి స్టాక్స్ లాభపడ్డాయి. సన్ ఫార్మా, టైటాన్, ఐటిసి, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
భారతీయ ఈక్విటీ సూచీలు ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ , బిఎస్‌ఇ సెన్సెక్స్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి, రెండు రోజుల లాభల పరంపరను కంటిన్యూ చేశాయి. నిఫ్టీ సూచీ 0.24 శాతం లాభపడి 19,574 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడి 65,780 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1 శాతం పైగా లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.84 శాతం జంప్ చేసింది. సెక్టార్ల వారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఆటోలు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మీడియా ఇంట్రాడేలో 3 శాతం పైగా జంప్ చేసి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి, నిఫ్టీ ఐటి కూడా లాభాలను జోడించాయి.
సెన్సెక్స్‌లో సన్ ఫార్మా టాప్ గెయినర్‌గా నిలిచింది
నేటి ట్రేడింగ్‌లో 18 సెన్సెక్స్ 30 సూచీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌లో సన్‌ఫార్మా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా టాప్ గెయినర్స్ గా లాభపడ్డాయి. సన్ ఫార్మా షేర్లు 2.09 శాతానికి ఎగబాకాయి. దీంతోపాటు ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ కూడా లాభాల్లోనే కొనసాగాయి.
ఈ షేర్లలో క్షీణత
మరోవైపు సెన్సెక్స్ 30 సూచీలోని 12 షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, విప్రో, ఎస్‌బిఐ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. దీని షేర్లు దాదాపు 1.46 శాతం పడిపోయాయి.