బెంగళూరులో ఉన్న పేటి‌ఎం, రేజర్ పే,  క్యాష్ ఫ్రీ  ఆరు స్థానాలపై దాడి చేస్తున్నట్లు ఈ‌డి శనివారం తెలిపింది. ఈ దాడుల్లో చైనా ప్రజల నియంత్రణలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.17 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది.

పీఎంఎల్ యాక్ట్ 2002 ప్రకారం కర్ణాటకలోని బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. చైనీస్ లోన్ యాప్ కేసులో విచారణ సందర్భంగా ఈడీ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే కంపెనీలైన రేజర్‌పే, పేటీఎం, క్యాష్ ఫ్రీ లొకేషన్‌లపై ఈ దాడులు చేస్తున్నట్టు ఈడీ శనివారం వెల్లడించింది.

బెంగళూరులో ఆరు చోట్ల దాడులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం, బెంగళూరులోని ఆరు ప్రదేశాలలో శుక్రవారం (సెప్టెంబర్ 2) ఈ దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ దాడుల్లో చైనా ప్రజల నియంత్రణలో ఉన్న సంస్థల మర్చంట్ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.17 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది.

ఈ‌డి ప్రకారం ఈ సంస్థలు పని చేసే విధానం ఏమిటంటే వారు ఇండియన్ సిటిజెన్స్ నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి వారిని డమ్మీ డైరెక్టర్లుగా చేసి అక్రమ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈ సంస్థలు చైనా ప్రజల ద్వారా నియంత్రించబడుతున్నాయని ఈ‌డి తెలిపింది.

అక్రమ వ్యాపారం నడుపుతున్న ఆన్‌లైన్ పేమెంట్ కంపెనీలు 
పేమెంట్ గేట్‌వేలు వివిధ వ్యాపారుల ఐ‌డిలు, బ్యాంకుల్లో నిర్వహించే అక్కౌంట్స్ ద్వారా ఈ సంస్థలు అనుమానాస్పద, చట్టవిరుద్ధమైన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ‌డి తెలిపింది. Razorpay Pvt Ltd, Cashfree Payments, Paytm Payment Services Ltd వంటి కంపెనీల ప్రాంగణాల్లో సెర్చ్ ఆపరేషన్ సమయంలో వీటిని చైనా ప్రజలు నియంత్రిస్తూ, నిర్వహిస్తున్నారని వెలుగులోకి వచ్చిందని ఈ‌డి తెలిపింది.

ఇచ్చిన చిరునామాలు నకిలీవి
ఈ‌డి ప్రకారం ఈ సంస్థలు వివిధ వ్యాపారి ఐ‌డిలు, అక్కౌంట్స్ ద్వారా అక్రమ ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. ఎం‌సి‌ఏ (కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్టర్డ్ అడ్రస్ నుండి కూడా ఈ సంస్థలు పనిచేయడం లేదని దర్యాప్తులో గుర్తించినట్లు, నకిలీ అడ్రస్ తో కార్యకలాపాలు సాగిస్తున్నారు అని ఈ‌డి తెలిపింది. 

18 కేసులు నమోదు
 బెంగళూరు పోలీసు సైబర్ క్రైమ్ స్టేషన్ రిజిస్టర్ చేసిన 18 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దాడులు కొనసాగుతున్నయి అని ఈ‌డి తెలిపింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లు సంస్థలు, వ్యక్తులపై రిజిస్టర్ చేయబడ్డాయి.