అలీబాబా వ్యవస్థాపకుడు, చైనా దేశ అత్యంత ధనవంతుడు  జాక్ మా, కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్‌ను కనుగొనడంలో సహాయపడటానికి తన ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ యువాన్లను (14.4 మిలియన్లు) విరాళంగా ఇచ్చారు.జాక్ మా ఫౌండేషన్ నుండి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం బిలియనీర్ అయిన జాక్ మా రెండు చైనా ప్రభుత్వ పరిశోధన సంస్థల కోసం 40 మిలియన్ యువాన్లను (5.8 మిలియన్ డాలర్లు)జాక్ మా  కేటాయించారు.

also read కరోనా వైరస్ ఎఫెక్ట్: గాంధీలో ఒకరికి పరీక్షలు, భయం ఇదీ....

మిగిలిన నిధులను "నివారణ మరియు చికిత్స" చర్యలకు కోసం ఉపయోగించనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్, హుబే ప్రావిన్స్‌లకు వైద్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి 1 బిలియన్ యువాన్ (144 మిలియన్) నిధిలను ఏర్పాటు చేస్తున్నట్లు అలీబాబా శనివారం ప్రకటించిది.

టీకా లేదా చికిత్సల కోసం  మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ పరిశోధన సంస్థలకు కంపెనీ ఉచిత AI కంప్యూటింగ్ పవర్ ని కూడా అందిస్తోంది.కరోనావైరస్ చికిత్స ప్రయత్నాలకు నిధులు విరాళంగా ఇచ్చే చైనా టెక్నాలజీ కంపెనీలలో అలీబాబా ఒకటి అని ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక వార్తాపత్రిక చైనాలో తెలిపింది.

also read కరోనా రోగుల శాడిజం... మిగితా వాళ్లకి కూడా వైరస్ సోకాలని..

దీనితో పాటు టెలికాం డివైజులు, స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే, ఇ-కామర్స్ కంపెనీ టెన్సెంట్ (టిసిహెచ్‌వై), సెర్చ్ ఇంజన్ బైడు (బిడు), టిక్‌టాక్ యజమాని బైట్‌డాన్స్, ఫుడ్ డెలివరీ సంస్థ మీటూవాన్-డయాన్‌పింగ్ కూడా ఉన్నాయి.టీకా కోసం పనిచేసే వారిలో యునైటెడ్ స్టేట్స్, చైనాలోని శాస్త్రవేత్తలు ఉన్నారు.

టీకా అందుబాటులోకి వచ్చేసరికి ఒక సంవత్సరానికి పైగా సమయం పడుతుండొచ్చు అని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు.ఈ వైరుస్ వల్ల ఇప్పటివరకు కనీసం 132 మందిని మరణించారు. చైనాలో ప్రధాన నగరంలో దాదాపు 6,000 కేసులు నిర్ధారించబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో సహా ఇతర చోట్ల 80 కి పైగా కేసులు నిర్ధారించబడ్డాయి.