కరోనా వైరస్ మహమ్మారి నుండి చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. సోమవారం విడుదల చేసిన సెప్టెంబర్ క్వార్టర్ డేటాలో ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి.  

ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా మెరుగుపడింది అలాగే కరోనా వైరస్ అంటువ్యాధిపై పూర్తి నియంత్రణను చైనా ప్రకటించింది. మాస్కూలు, ఇతర వైద్య ఉత్పత్తులకు విదేశీ డిమాండ్ పెరగడం వల్ల చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా మెరుగుపడింది. ఇంకా ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా మెరుగుపడుతుంది.

చైనాలో రిటైల్ అమ్మకాల సంఖ్య ఇప్పుడు కోవిడ్ -19 పూర్వ స్థాయికి చేరుకుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇప్పటికీ సంక్లిష్టంగా, తీవ్రంగా ఉందని బ్యూరో హెచ్చరించింది. 

also read  ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు.. ...

కరోనా వైరస్ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో ఉద్భవించింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో చైనా 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.  కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో వృద్ధిని నమోదు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన దేశం చైనా. 

సెప్టెంబరులో ఎగుమతులు 9.9 శాతం పెరిగాయి. కస్టమ్స్ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనా ఎగుమతులు 9.9 శాతం పెరిగి 239.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఎగుమతులు ఆగస్టులో 9.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

 అదేవిధంగా దిగుమతులు 13.2 శాతం పెరిగి 202.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టులో చైనా దిగుమతులు 2.1 శాతం తగ్గాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది.

దీంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది, కానీ చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే చైనా ఆర్థిక వ్యవస్థ దాని ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చింది.