టెస్లాకు టక్కర్ ఇచ్చేందుకు... భారత్ లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా ఈవీ కార్ల దిగ్గజం BYD ఎంట్రీ...

చైనాకు చెందిన BYD కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలను తయారు చేయడానికి భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనుకుంటోంది. ఇందుకోసం భారత్‌లోని ఓ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటోంది. 

China BYD to invest $1 billion to make EVs, batteries in India: Report MKA

చైనా కంపెనీ BYD కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలను తయారు చేయడానికి స్థానిక కంపెనీ సహకారంతో భారతదేశంలో 1 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు  ఆసక్తి చూపిస్తోంది. కంపెనీకి సంబంధించిన ఈ ప్లాన్‌పై ప్రత్యక్ష అవగాహన ఉన్న ముగ్గురు వ్యక్తులు ఈ విషయాన్ని  తెలియజేశారు. BYD ఇప్పటికే  హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ EVలను తయారు చేయడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ నియంత్రణ సంస్థలకు ప్రతిపాదించినట్లు  బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనంలో పేర్కొన్నారు. 

ఈ డీల్ కు సంబంధించిన కీలక వ్యక్తులు కొందరు తెలియజేసిన సమాచారం ప్రకారం  'భవిష్యత్తులో BYD బ్రాండ్, అన్ని ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. వీటిలో హ్యాచ్‌బ్యాక్‌ల నుండి లగ్జరీ మోడల్స్ వరకు అన్నీ ఉంటాయి. BYD అనేది ఎలక్ట్రిక్ వాహనాలు,  ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద  సొంతగా పేరుంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు BYD  ప్రతినిధులు ఇంకా సిద్ధంగా లేరు.  ఇదిలా ఉంటే,  చైనాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్‌లో తమ ఫ్యాక్టరీని నెలకొల్పాలనుకుంటున్నట్లు గతంలోనే చెప్పింది. కాగా ఈ డీల్ కు సంబంధించి వాణిజ్య, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా  ఎలాంటి స్పందన  అందించలేదు.

BYD టెస్లాకు సవాలు  విసురుతోంది..

ప్రముఖ  అమెరికా EV కంపెనీ అయిన టెస్లాను సవాలు చేసేందుకు BYD ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అందుకే ఇండియాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీని ప్రతిపాదన భారత్‌లో ఆమోదం పొందినట్లయితే, US మినహా అన్ని ప్రధాన ప్రపంచ మార్కెట్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటుంది.

BYD ఇప్పటికే భారతదేశంలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దీని కింద, ఇది Eto 3 ఎలక్ట్రిక్ SUV ,  E6 EVలను కంపెనీలకు వారి ఉపయోగం కోసం విక్రయిస్తుంది. ఈ ఏడాది లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ సీల్‌ను విడుదల చేయాలని కూడా యోచిస్తోంది.

పెట్టుబడి ప్రతిపాదనలో, BYD ,  మేఘా ఇంజినీరింగ్ భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి, R&D, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను కూడా వెల్లడించినట్లు వర్గాలు తెలిపాయి. భారతదేశంలో, BYD స్థానిక కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్, చైనీస్ ప్రత్యర్థి MG మోటార్‌తో పోటీపడుతుంది. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో ముందంజలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, 2020 నుండి, చైనాతో సహా పొరుగు దేశాల నుండి వచ్చే పెట్టుబడుల విషయంలో భారతదేశం జాగ్రత్తగా ఉంటోంది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా, చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ భారతదేశంలో 1 బిలియన్ పెట్టుబడి పెట్టే ప్రణాళికను రద్దు చేసుకుంది. మరొక చైనీస్ వాహన తయారీ సంస్థ, SAIC తన MG మోటార్ కోసం స్థానిక భాగస్వామిని వెతుక్కోవలసి వచ్చింది.

BYD అనేది చైనాలోని షెన్‌జెన్ కు చెందిన కంపెనీ ఈ సంస్థ 2007లో భారతదేశంలో అడుగు పెట్టింది. ఈ కంపెనీ ప్రారంభంలో, మొబైల్ ఫోన్‌ల కోసం బ్యాటరీలు ఇతన విడిభాగాలను తయారు చేసేది. తర్వాత 2013లో మేఘా ఇంజినీరింగ్‌తో కలిసి కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు భారతదేశంలో, మొత్తం కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉంది, 2022లో దాదాపు 3.8 మిలియన్లకు చేరుకుంది. అయితే 2030 నాటికి దీనిని 30 శాతానికిపెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios