ఆనంద్ మహీంద్రాను కదిలించిన చాయ్ వాలా...ఈ టీ స్టాల్ వీడియో చూస్తే మీరు షాక్ తినడం ఖాయం..
ఆనంద్ మహీంద్రా కొత్త ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అమృత్‌సర్‌లోని టీ స్టాల్ వీడియోను పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియో మామూలు టీ స్టాల్ వీడియో కాదు. ఈ టీ దుకాణం సహజంగా ఏర్పడిన ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో ఈ టీ స్టాల్ ఏర్పాటు చేశారు.
రోడ్డు పక్కన చాలా టీ స్టాళ్లు కనిపిస్తాయి. కొందరైతే థర్మోస్‌లో టీ ఉంచి దుకాణదారులకు ఎలాంటి స్టాల్ లేకుండా విక్రయిస్తుంటారు. కొంత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు కాస్త భిన్నమైన టీ స్టాల్ నిర్మిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలోని టీ స్టాల్ మర్రి చెట్టు లోపల ఉంది. ఈ టీ స్టాల్ నడిపే వృద్ధ వ్యాపారి గ్యాస్ స్టవ్ మీద కాకుండా బొగ్గుల పొయ్యి మీద టీ సిద్ధం చేయడం ఇక్కడి స్పెషాలిటీ.
ఈ టీ స్టాల్ బిలియనీర్ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హృదయాన్ని తాకింది. అలాగే సామాన్యులు కూడా బాబా టీ స్టాల్‌ని ఇష్టపడతారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. అమృత్‌సర్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ తదుపరిసారి నేను నగరాన్ని సందర్శించినప్పుడు, గోల్డెన్ టెంపుల్‌తో పాటు చాయ్ సేవా మందిర్‌ను తప్పకుండా సందర్శిస్తాను' అని మహీంద్రా ట్వీట్ చేశారు. 40 ఏళ్లుగా బాబా ఈ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
జూలై 23న ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 3 లక్షల 78 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 12 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, చాలా మంది యూజర్లు దీనిపై వ్యాఖ్యానించారు. ఈ వీడియోను చూసిన వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. మరికొందరు టీ అమ్మే తాతగారికి పాదాభివందనం చేశారు. ఈ వీడియో నిజంగా హృదయానికి హత్తుకునేలా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. బాబా జీకి హృదయపూర్వక నమస్కారాలు” అని మరొకరు రాశారు.
ఇదిలా ఉంటే ఈ వృద్ద టీ వ్యాపారి పేరు అజిత్ సింగ్. చాలామందికి ఆయన పేరు తెలియదు. ఆయనను బాబా అంటారు. ఆయనకు పెద్దగా కోరికలు లేవు. బాబా సేవ చేస్తున్నారు. పని చేస్తూ ఉండండి, మీరు బాగుపడతారు అన్నారు బాబా. సేవ చేశానని చెప్పుకునే బాబా డబ్బులు చెల్లించకుండా వెళ్లినా కస్టమర్ల మాట వినడు. టీకి కావాల్సిన సామాను బాబా స్వయంగా తెస్తాడు, దొంగతనం భయం లేదు. అతని స్టాల్‌కు తలుపు లేదు, భద్రత లేదు. మసాలా టీ చేసే బాబాకు ఒక గ్లాసు టీకి 10 రూపాయలు లభిస్తాయి. గ్లాస్‌ని కూడా తానే శుభ్రం చేసుకుంటాడు. ఉదయం 9 గంటల నుండి వారి దుకాణంలో లభించే టీ అద్భుతంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.