మంగళవారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ ప్ర‌స్తుతం రెవ‌న్యూ షేరింగ్ ఫార్ములా ప్ర‌కారం రాష్ట్రాల జీఎస్టీ వాటాను ప్రభుత్వం చెల్లించే స్థితిలో లేదని ఒక  ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

నివేదిక ప్రకారం,కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆదాయ కొరతపై అడిగిన ప్రశ్నకు అజయ్ భూషణ్ పాండే బదులిచ్చారు. రాష్ట్రాలు పట్ల ఉన్న నిబద్ధతపై ప్రభుత్వం ఎలా ఉపసంహరించుకుంటుందని సభ్యులు ఆయనను ప్రశ్నించారు.

ఈ సమయంలో, "ఆదాయ సేకరణ ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పరిహారం చెల్లించే ఫార్ములాను జిఎస్టి చట్టం తిరిగి రూపొందించడానికి నిబంధనలు ఉన్నాయని ఆయన ఎత్తి చూపారు" అని కమిటీ సభ్యులలో ఒకరు చెప్పారు.

also read బంగారం కంటే వెండి యమ కాస్ట్లీ.. 9 రోజుల్లో రూ.12560 పెంపు.. ...

2019-20 ఆర్థిక సంవత్సరానికి 13,806 కోట్ల రూపాయల జి‌ఎస్‌టి పరిహారాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. జి‌ఎస్‌టి కౌన్సిల్ జూలైలో సమావేశమై రాష్ట్రాలకు జి‌ఎస్‌టి పరిహారాన్ని తిరిగి చెల్లించడానికి ఫార్ములాని రూపొందించాల్సి ఉంది.

అయితే, ఇంతవరకు ఆ సమావేశం జరగలేదు. దేశవ్యాప్త లాక్ డౌన్ సడలింపు తరువాత మొదటిసారి సమావేశమైన కమిటీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడానికి బదులు "ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, భారతదేశ వృద్ధి సంస్థలకు ఫైనాన్సింగ్" అనే చర్చను చేపట్టింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారీగా ఎదురుదెబ్బ తగిలిన ప్రస్తుత ఆర్థిక స్థితిగతులపై కమిటీ చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, అంబికా సోని, గౌరవ్ గోగోయి, ఎన్‌సిపి ఎంపి ప్రఫుల్ పటేల్ గట్టిగా కోరారు.