ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కొర్పోరేషన్ (ఐఆర్‌సిటిసి) లోని తన వాటాలో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఒక అభ్యర్థనలో ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డి‌ఐ‌పి‌ఏ‌ఎం) అమ్మకాల ప్రక్రియను నిర్వహించడానికి సెప్టెంబర్ 10 లోగా సెబీలో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించింది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈబి‌ఐ) నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ప్రమోటర్లు వాటాలను 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్ఎస్) పద్ధతి ద్వారా ఐఆర్‌సిటిసి పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ కొంత భాగాన్ని దాని వాటా నుండి పెట్టుబడి పెట్టాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది.

also read బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. నేడు 10గ్రా ఎంతంటే ? ...

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబి) నియమ నిబంధనలకు అనుగుణంగానే షేర్ల అమ్మాకలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

రెల్వేలో పనిచేసే ఉద్యుగలకు అర్హత ఉంటే షేర్లలో డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విక్రయ ప్రక్రియపై మర్చెంట్‌ బ్యాంకర్లు అధ్యయనం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా సంస్థ మూలధనం రూ.250 కోట్లు కాగా, పెయిడ్ అప్ క్యాపిటల్ రూ .160 కోట్లు.

ప్రస్తుతం రైల్వే శాఖ షేర్ క్యాపిటల్‌లో 87.40 శాతం  వాటాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.27 గంటలకు, బిఎస్‌ఇలో ఐఆర్‌సిటిసి షేర్లు రూ .1,351.65 వద్ద ట్రేడవుతున్నాయి, అంతకుముందుతో పోలిస్తే రూ.5 లేదా 0.37 శాతం పెరిగింది.