Asianet News TeluguAsianet News Telugu

నవంబర్ 30లోగా మీ రేషన్ కార్డ్ అప్‌డేట్ చేసుకోండి .. లేదంటే డిసెంబర్ నుండి రేషన్ కట్..

రద్దు చేసిన రేషన్ కార్డులకు బదులుగా సరైన, అర్హత కలిగిన లబ్ధిదారులకు లేదా కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి, దాని కార్యకలాపాలలో పారదర్శకత తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.

central government cancelled more than 4 crore duplicate and fake ration card under nfsa
Author
Hyderabad, First Published Nov 9, 2020, 4:40 PM IST

రేషన్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టడానికి, సరైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 4.39 కోట్ల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసింది.

రద్దు చేసిన రేషన్ కార్డులకు బదులుగా సరైన, అర్హత కలిగిన లబ్ధిదారులకు లేదా కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి, దాని కార్యకలాపాలలో పారదర్శకత తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.

వీటిలో ఒకటి నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయడం. అంతే కాకుండా నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయడం వెనుక ప్రభుత్వం అనేక కారణాలు కూడా చెప్పింది. 

రేషన్ కార్డులు, లబ్ధిదారుల డేటాబేస్ డిజిటలైజేషన్, రేషన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం, అనర్హులైన లేదా బోగస్ రేషన్ కార్డులను గుర్తించడం, డిజిటలైజ్డ్ డేటాలో నకిలీ డేటా నిరోధించడం, లబ్ధిదారుల మైగ్రేషన్ లేదా మరణించిన వారిని గుర్తించడం అని తెలిపింది.

also read ఆన్‌లైన్ ట్రేయిన్ టికెట్ బుకింగులలో మార్పులు.. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం లభించనుంది.. ...

2013-20 వరకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు దేశం మొత్తంలో 4.39 కోట్ల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశాయి. ఇది కాకుండా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ జారీ చేసిన సంబంధిత కోటాను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద లబ్ధిదారులను సరిగ్గా గుర్తించడానికి సంబంధిత రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా పనిచేస్తున్నాయి.

దీని కింద, అర్హత కలిగిన లబ్ధిదారులు, కుటుంబాల వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతోంది.

మీరు మీ లేదా మీ కుటుంబం ఆధార్ కార్డులను రేషన్ కార్డుతో అనుసంధానించకపోతే మీ రేషన్ కార్డు రద్దు చేయవచ్చు. రేషన్ కార్డుదారులు వారి రేషన్ కార్డును, ఆధార్‌తో అప్‌డేట్ చేయడానికి ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది.

నవంబర్ 30 తరువాత ఆధర్ అనుసంధానించని రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు పొందటంలో సమస్యలు ఎదురవ్వొచ్చు. అలాగే, రేషన్ కార్డుల ఆన్‌లైన్ డేటా నుండి కూడా వారి పేర్లను తొలగించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios