Cello World IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..అయితే సెల్లో వరల్డ్ ఐపీవో వివరాలు మీ కోసం..

సెల్లో వరల్డ్ IPO అక్టోబర్ 30న తెరుచుకోనుంది. అలాగే ఈ ఐపీవో నవంబర్ 1న ముగుస్తుంది. ఇష్యూ తెరవడానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్లు అక్టోబర్ 27న షేర్ల కోసం బిడ్ వేసుకునే అవకాశం అందిస్తోంది.

Cello World IPO Want to invest in IPO MKA

స్టేషనరీ తయారీ సంస్థ సెల్లో వరల్డ్ లిమిటెడ్ తన రూ. 1,900 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ఒక్కో షేరు ధర రూ.617-648గా నిర్ణయించింది. సెల్లో వరల్డ్ యొక్క IPO అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1న ముగుస్తుంది. ఇష్యూ ప్రారంభానికి ముందు, అక్టోబర్ 27న యాంకర్ ఇన్వెస్టర్ షేర్ల కోసం బిడ్స్ ఓపెన్ చేయనున్నారు. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS)పై ఆధారపడి ఉంటుంది. ప్రమోటర్లు అలాగే షేర్‌హోల్డర్‌లు షేర్ల విక్రయం చేయనున్నారు.  ఇందులో కొత్త షేర్లు జారీ చేయబడవు.

ఇష్యూలో, కంపెనీ తన అర్హతగల ఉద్యోగుల కోసం 10 కోట్ల రూపాయల వరకు విలువైన షేర్లను రిజర్వ్ చేయాలని పేర్కొంది. సెలో వరల్డ్ గతంలో రూ.1,750 కోట్ల ఇష్యూను ప్రతిపాదించగా, తర్వాత దాని పరిమాణాన్ని రూ.1,900 కోట్లకు పెంచింది. పంకజ్ ఘిసులాల్ రాథోడ్, గౌరవ్ ప్రదీప్ రాథోడ్, ప్రదీప్ ఘిసులాల్ రాథోడ్, సంగీతా ప్రదీప్ రాథోడ్, బబితా పంకజ్ రాథోడ్, రుచి గౌరవ్ రాథోడ్ ఈక్విటీ షేర్ల విక్రయాన్ని OFS ప్రతిపదికన చేయనున్నారు.

కంపెనీ షేర్లు BSE,  NSE రెండింటిలోనూ లిస్ట్ చేయబడతాయి. గృహోపకరణాలు, స్టేషనరీ ఉత్పత్తులను విక్రయించే కంపెనీకి దేశవ్యాప్తంగా ఐదు వేర్వేరు ప్రదేశాలలో 13 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లకు చేరుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios