ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ రిటైల్ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) శుక్రవారం ఆమోదం తెలిపింది.

" ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ & వేర్ హౌస్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్, ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి కమిషన్ ఆమోదం తెలిపింది" అని సిసిఐ ఒక ట్వీట్‌లో తెలిపింది.

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆగస్టులో కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఒప్పందంపై ఫ్యూచర్ గ్రూప్ ఇంకా అమెజాన్ మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది.  

రిలయన్స్ రిటైల్ ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్, ఎఫ్‌బిబి, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ ఫార్మాట్లలో 1,800 స్టోర్లకు అక్సెస్ లభించనుంది, ఇవి భారతదేశంలోని 420 నగరాల్లో విస్తరించి ఉన్నాయి. ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలను ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఎఫ్ఇఎల్) లో విలీనం చేస్తున్న పథకంలో భాగంగా ఈ కొనుగోలు జరుగుతోంది.

also read ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వివాదం.. అతను ఎవరో తెలీదంటూ మాట మార్చిన రామలింగరాజు.. ...

ఫ్యూచర్ గ్రూప్  రిటైల్, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎఫ్ఎల్ఎల్) కు బదిలీ చేయబడుతుంది, ఇది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ.

అమెజాన్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి), స్టాక్ ఎక్స్ఛేంజీలు, సిసిఐలను కూడా సంప్రదించి, మధ్యవర్తిత్వ క్రమాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరింది.

ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ఇంతకుముందు ఢీల్లీ హైకోర్టుకు అమెజాన్ తన వాటాదారు కాదని, దాని వ్యవహారాల్లో ఎటువంటి అభిప్రాయం లేదని, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐ‌ఏ‌ఏ‌సి) ఆమోదించిన మధ్యంతర ఉత్తర్వులకు విలువ లేదని చెప్పారు.  

రిలయన్స్ రిటైల్ ఆర్మ్‌తో ఒప్పందానికి వ్యతిరేకంగా నియంత్రణ సంస్థలను సంప్రదించకుండా అమెజాన్‌ను నిరోధించాలని కోరుతూ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ చేసిన విజ్ఞప్తిపై ఢీల్లీ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులను రిజర్వు చేసింది.

కోర్టు రెండింటి వాదనలను ముగించి తీర్పును రిజర్వు చేసింది. నవంబర్ 23 లోగా లిఖితపూర్వక సమర్పణలను దాఖలు చేయాలని కోర్టు వారికి ఆదేశించింది.