Asianet News TeluguAsianet News Telugu

Carl Icahn Hindenburg: హిండెన్ బర్గ్ దెబ్బకు మరో బిలియనీర్ బలి..ఒక్క రోజులోనే రూ. 81,000 కోట్లు ఆవిరి..

హిండెన్‌బర్గ్ సంస్థ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్ కార్ల్ ఇకాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇంతకుముందు, అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సామ్రాజ్యాలపై దండెత్తిన హిండెన్ బర్గ్ , ఇప్పుడు కార్ల్ ఇకాన్ సామ్రాజ్యంలో భూకంపం పుట్టించింది. 

Carl Icahn Hindenburg Another billionaire victim of Hindenburg blow In one day Rs. 81,000 crore steam MKA
Author
First Published May 3, 2023, 1:09 PM IST

మొన్న అదాానీ, నిన్న జాక్ డోర్సే, ఇలా వరుసగా ఒక్కో బిలియనీర్ సామ్రాజ్యాలపై దండయాత్ర చేస్తున్న హిండెన్ బర్గ్ రిపోర్ట్ తాజాగా మరో అమెరికన్ బిలియనీర్,  కార్పొరేట్ దిగ్గజం కార్ల్ ఇకాన్  (carl icahn) ను టార్గెట్ చేసింది. దీంతో ఇప్పుడు అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బకు కుదేలు అవుతున్నాడు. కార్ల్ కంపెనీ ఐకాన్ ఎంటర్‌ప్రైజెస్ LPకి వ్యతిరేకంగా ఒక నివేదికను విడుదల చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. హిండెన్‌బర్గ్ ఇకాన్ ఎంటర్‌ప్రైజెస్ పోంజీ స్కీం అని ఆరోపించింది. ఇకాన్ ఇంటర్ ప్రైజెస్ అవకతవకలను బయటపెట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత, కార్ల్ ఇకాన్ సంపద మంగళవారం ఒక్కరోజే రూ.81,809 కోట్ల (10 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ తరిగిపోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన తర్వాత Icahn Enterprises LP షేర్లు 20 శాతం వరకు పడిపోయాయి.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో భారత్ చెందిన అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేయగా, ఆ దెబ్బతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ దెబ్బ నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కోలుకోలేకపోయింది. అదానీ తర్వాత, షార్ట్ సెల్లర్ సంస్థ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంస్థ బ్లాక్ ఇంక్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది.

 

Icahn Enterprises షేర్లలో భారీ పతనం

హిండెన్‌బర్గ్ రిపోర్టు వెలువడిన అనంతరం. మంగళవారం Icahn Enterprises LP షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. దీంతో షేర్లు 20 శాతం వరకు క్రాష్ అయ్యాయి. ఈ కంపెనీ కార్ల్ ఐకాన్ హోల్డింగ్ కంపెనీగా పనిచేస్తుంది. కంపెనీ షేరు ధరలో భారీ పతనం కారణంగా కార్ల్ ఇకాన్ సంపద  3.1 బిలియన్ డాలర్లు క్షీణించింది. హిండెన్ బర్గ్ నివేదికలో ప్రధానం ఐకాన్ ఎంటర్‌ప్రైజెస్‌ లో షేర్లను తాకట్టు పెట్టిన తీసుకున్న రుణంలో  కార్ల్ ఇకాన్ వాటా గురించి పేర్కొంది. మరోవైపు కార్ల్ ఇకాన్ సంపద ఒక రోజులో 10 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, బిలియనీర్ల జాబితాలో కార్ల్ ఇకాన్  58వ స్థానం నుండి 119వ స్థానానికి పడిపోయాడు.హిండెన్‌బర్గ్ నివేదిక కంటే ముందు కార్ల్ ఇకాన్ నికర విలువ 25 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని 58వ ధనవంతుడు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అతని సంపద 41 శాతం తగ్గి 14.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్షీణత తర్వాత, కార్ల్ ఇకాన్ కూడా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల టాప్-100 జాబితా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో 119వ స్థానంలో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios