న్యూ ఢీల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ థింక్ అండ్ లెర్న్ బైజు లెర్నింగ్ యాప్ ముంబైకి చెందిన వైట్‌హాట్ జూనియర్‌ను 300 మిలియన్లకు(దాదాపు రూ 2,250 కోట్లు)  కొనుగోలు చేసింది. బుధవారం సాయంత్రం దీనికి సంబంధించి ఒక ప్రకటన వెల్లడైంది. డిస్కవరీ నెట్‌వర్క్స్ ఇండియా మాజీ సిఇఒ కరణ్ బజాజ్ 2018లో వైట్‌హాట్ జూనియర్ సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ కే-12 విభాగంలో పిల్లలకు ఆన్లైన్ లో కోడింగ్ పై శిక్షణ ఇస్తు పనిచేస్తుంది. విద్యార్థులకు కోడింగ్ పై ఆసక్తి ని పెంపొందించటంతో పాటు వారు పూర్తిస్థాయిలో గేమ్స్, ఆనిమేషన్, మొబైల్ ఆప్స్ ను అభివృద్ధి చేసేలా సహాయపడుతుంది. ఇవి కూడా వాణిజ్య పరంగా పనికొచ్చేలా ఉండటం విశేషం.

వైట్‌హాట్  స్టార్టప్ సంస్థ సొంతంగా కోడింగ్ పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. ఆన్‌లైన్ ఇంటరాక్టివ్, లైవ్ ద్వారా పాఠాలను చెప్పేందుకు అనుకూలంగా ఉంటుంది. వైట్‌హాట్ జూనియర్‌ 150 మిలియన్ల రెవెన్యూ అర్జీస్తున్నట్లు పేర్కొంది. డీసీ అడ్వైసర్స్  అనే సంస్థ ఈ లావాదేవీకి ప్రత్యేక ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించారు.

also read వడ్డీ రేట్లపై ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. యథాతథం కొనసాగింపు.. ...

ఈ కొనుగోలు ఇప్పుడు బైజు యాప్ పిల్లలకు కోడింగ్ పాఠ్యాంశాలను ప్రారంభించటానికి అనుమతిస్తుంది. "పిల్లలు ఇష్టపడే కోడింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించినందుకు క్రెడిట్ అతనికి, అతని బృందానికి దక్కుతుంది. అతని నాయకత్వంలో సంస్థ భారతదేశం, యుఎస్ లో తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది"అని బైజు వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బైజు రవీంద్రన్ అన్నారు.

రెండు సంవత్సరాల వయస్సున్న లెర్నింగ్ యాప్ అయిన డౌట్‌నట్‌ను $ 100- $ 150 మిలియన్లకు కొనుగోలు చేయడానికి బైజు చర్చలు అధునాతన దశలో ఉన్నట్లు తెలిపింది. వైట్‌హాట్ జూనియర్ కొనుగోలు బైజు సంస్థ అతిపెద్ద డీల్. గతంలో యుఎస్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఓస్మోను 2019 జనవరిలో 120 మిలియన్ డాలర్లుకు  దక్కించుకుంది.

దీనికి ముందు మాథ్ అడ్వెంచర్స్, ట్యూటర్ విస్టా, విద్యార్త్లను కూడా బైజు సొంతం చేసుకుంది. రష్యా బిలియనీర్ యూరి మిల్నర్ నేతృత్వంలోని డిఎస్టీ గ్లోబల్ పెట్టుబడి సంస్థ బైజు సంస్థలో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి చర్చల దశలో ఉందని ఈ వారం ప్రారంభంలో బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.