మహిళలు తమ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా,  ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత మీకు దక్కే మూడు నాలుగు గంటల సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు.  అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడి తోనే మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. తద్వారా ప్రతినెల మీరు ఆర్థికంగా  నిలదొక్కుకోవడానికి డబ్బు మీ చేతికి దక్కుతుంది. 

ప్రస్తుతం పట్టణంలో ఎక్కువగా కర్రీ పాయింట్స్ వంటివి కనిపిస్తూ ఉన్నాయి. . నిజానికే కర్రీ పాయింట్స్ ఆలోచన పాతదే కానీ, ఇందులో నిరంతరం ఆదాయం మీకు లభిస్తూనే ఉంటుంది. కర్రీ పాయింట్స్ అనేది ముఖ్యంగా పట్టణాల నుంచి చిన్న గ్రామాలకు సైతం పాకాయి. ఎందుకంటే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు ఇంటి వద్ద వండుకోవడానికి సమయం దక్కడం లేదు. దీన్నే మీరు వ్యాపార అవకాశం గా మలుచుకొని మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.

మీరు కర్రీ పాయింట్ స్థాపించాలంటే ముఖ్యంగా ఒక మంచి కమర్షియల్ సెంటర్ ను చూసుకోవాల్సి ఉంటుంది చుట్టూ హాస్టల్స్ బ్యాచిలర్స్ విద్యార్థులు ఉద్యోగస్తులు నివాసం ఉండే ప్రదేశాల్లో అయితే కర్రీ పాయింట్ సక్సెస్ అవుతుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే ఒక షాపును రెంటుకు తీసుకోవాల్సి ఉంటుంది. కిచెన్ అనుబంధంగా ఉన్న షాప్ అయితే మరింత వీలుగా ఉంటుంది ఒకవేళ లేకపోయినా మీ ఇంటి వద్ద కూరలను వండుకొని షాపులో ఉంచి విక్రయించుకోవచ్చు. 

 వెజ్ నాన్ వెజ్ రెండు గంటలకు అందుబాటులో ఉంచడం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది అలాగే బిర్యానీ సైతం అందుబాటులో ఉంచితే మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం కర్రీ పాయింట్ తో పాటు చపాతీ సెంటర్ ను కూడా పెట్టుకోవడం ద్వారా మీకు సేల్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. కర్రీ పాయింట్ పెట్టుబడికి సుమారు ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. 

Business Ideas: చదువుతో పనిలేదు, టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు. ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష మిగిలే చాన్స్

ఇక రుచి విషయంలో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు. కూరగాయలను ఎప్పటికప్పుడు తాజాగా వండి విక్రయిస్తేనే మళ్లీ మళ్లీ కస్టమర్లు మీ షాపుకు వస్తారు. నిల్వకూరలను వేడి చేసి అమ్మితే మొదటికే మోసం వస్తుంది అప్పుడు కస్టమర్ల ఆరోగ్యం దెబ్బతిని మళ్లీ మీ షాపు వంక చూడరు. నాణ్యమైన మసాలా దినుసులు నాణ్యమైన కారము నాణ్యమైన నూనె వాడటం వల్ల కస్టమర్లు మీ షాపుకు పదే పదే వస్తారు రుచి కూడా చాలా బాగుంటుంది. మిగిలిపోయిన కూరలను ఎప్పటికప్పుడు పడేయడం మంచిది. నష్టం వస్తుందని వాటిని రెండో రోజు అమ్మితే మొదటికే మోసం వస్తుంది. నాన్ వెజ్ విషయంలో చాలా జాగ్రత్తగా వండుకోవాల్సి ఉంటుంది కస్టమర్ల డిమాండ్ ను బట్టి, సీజన్ ను బట్టి తయారు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నాన్ వెజ్ కూరలు మిగిలిపోతే మీకు నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 

కర్రీ పాయింట్ మంచిగా రన్ అయితే రోజుకు కనీసం 10 నుంచి 20వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అంటే నెలకు సుమారుగా ఖర్చులు పోను ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదించుకునే వీలుంది.