Asianet News TeluguAsianet News Telugu

Business Ideas: జస్ట్ రూ.25 వేల పెట్టుబడితో మహిళలు ఇంటి వద్దే నెలకు రూ. 50 వేల వరకూ సంపాదించే బిజినెస్ ప్లాన్

ప్రస్తుత కాలంలో ఒక ఇంట్లో భార్య భర్త కలిసి సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకుంటే పెరుగుతున్న ధరలు, అద్దెలు, స్కూలు ఫీజులు, ఇతర ఖర్చుల నేపథ్యంలో ఒకరి సంపాదనతోనే ఇల్లు గడవడం దాదాపు అసాధ్యం. అయితే ఇద్దరూ జాబ్స్ చేస్తే ఇంట్లో పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం సాధ్యం కాదు.

Business Ideas With an investment of just Rs 25 thousand women can earn up to 50 thousand
Author
First Published Aug 19, 2022, 6:02 PM IST

మహిళలు ఇంటివద్దే ఉంటూ, రోజుకు కొన్ని గంటలు కష్టపడితే చాలు నెలకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేలు సంపాదించుకునే బిజినెస్ గురించి తెలుసుకుందాం. టీషర్ట్ ప్రింటింగ్ మెషీన్ చక్కటి బిజినెస్ మార్గం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు మహిళలు ఇంటివద్దే చేసుకోవచ్చు. ఇందుకోసం చేయవలసిందల్లా ఒక్కటే, మీరు ప్రింటింగ్ మెషీన్ కొనుగోలు చేసుకోవాలి. అలాగే హోల్ సేల్ గా టీషర్ట్స్ కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది.

ప్రస్తుతం మార్కెట్లో యువత ప్రింటెడ్ టీషర్టులను ధరించేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టపడుతున్నారు. అలాగే పలు రాజకీయ పార్టీలు, బిజినెస్ మార్కెటింగ్ వారు సైతం టీషర్టుపై తమ బ్రాండ్ ముద్రించి ప్రజలకు పంచి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రింటెడ్ టీషర్టులకు మంచి గిరాకీ ఉందని గుర్తించవచ్చు. 

ఇక మీరు పెద్ద ఎత్తున ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్ టీ షర్ట్ ప్రింటింగ్ మెషీన్, స్టిక్కర్ తయారీ యంత్రం కొనుగోలు చేసుకోవాలి. లేదంటే ఇంటివద్దనే సింపుల్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటే సెమీ ఆటోమేటిక్ ప్రింటింగ్ మెషీన్, స్టిక్కర్లు కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. అయితే  సెమీ ఆటోమేటిక్ ప్రింటింగ్ మెషీన్ ధర, రూ.25 వేల వరకూ ఉంది. అలాగు స్టిక్కర్లను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
 

మీరు ఈ బిజినెస్ కోసం టీషర్టులను హోల్ సేల్ గా కొనుగోలు చేసుకోవాలి. ఎలాంటి ప్రింట్ లేని ప్లెయిన్ టీషర్టులపై మీరు ఈ మెషీన్ సహాయంతో ప్రింట్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు హోల్ సేల్ లో ఒక టీషర్టును రూ. 150 కు కొనుగోలు చేస్తే ప్రింట్ వేసిన తర్వాత దాని ధర రూ. 500 వరకూ పలుకుతుంది. అంతే మీరు రిటైలర్ కు రూ. 300 కు అమ్మినా డబల్ లాభం పొందవచ్చు.

ఇక రాజకీయ పార్టీల ప్రచారం, మార్కెటింగ్ ప్రచారం కోసం టీషర్టుల ప్రింట్ ఆర్డర్ వస్తే మాత్రం మీరు స్టిక్కర్లను కావాల్సిన డిజైన్ లో గ్రాఫిక్ డిజైనర్ వద్ద చేయించుకోవాలి. ఇలా చేయడం ఇంటి వద్ద ఉండే మహిళలు తమకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఈ టీషర్ట్ ప్రింటింగ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు అదనపు ఆదాయం పొందవచ్చు. అలాగే షాపులతో ముందస్తు ఒఫ్పందాలు పెట్టుకోవడం వల్ల మీకు మరింత లాభదాయకంగా ఉంటుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios