Business Ideas: షాకింగ్ బిజినెస్...గాడిద పాలతో కోట్లు సంపాదిస్తున్న విజయవాడ దంపతులు...విదేశాలతో సైతం వ్యాపారం

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. కడివెడైన నేమి ఖరము పాలు.  అంటే దీని అర్థం ఆవుపాలు గరిటడైన చాలు అని గాడిద పాలు కుండ నిండా ఉన్నా గాని  వ్యర్థం అంటూ  వేమన శతకంలో ఓ పద్యం ఉంది.  కానీ ఇది నిజం కాదు ఆవుపాలకన్నా కూడా గాడిద పాలు చాలా విలువైనవి అని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువ వ్యాపారవేత్త నిరూపించారు.-

Business Ideas: Shocking business Vijayawada couple earning crores with donkey milk...business with foreign countries too MKA

గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని రోగనిరోధక శక్తిని పెంచుతాయని చిన్న పిల్లలకు తాగిస్తూ ఉంటారు.  వస్తువుల రవాణాలో ఒకప్పుడు గాడిదలను ఎక్కువగా వాడేవారు.  ప్రస్తుతం మోటారు వాహనాలు వచ్చినప్పటి నుంచి,  గాడిదల వినియోగం దాదాపు తగ్గిపోయింది.  చాలా గ్రామాల్లో గాడిదలు అంతరించిపోయాయి..  కానీ  శాస్త్రవేత్తలు మాత్రం గాడిద పాలు  చాలా విలువైనవని  చెబుతున్నారు. 

అయితే గాడిద పాలతోనే విదేశాలకు  సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి  ఏవిఆర్ ఫుడ్స్ అండ్ కాస్మోటిక్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు.  ఈ సంస్థ ద్వారా గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు షాంపూలు కండిషనర్లు కాస్మోటిక్ సహా ఇతర  గాడిద పాలతో చేసే ఆహార పదార్థాలను  విక్రయిస్తున్నారు.  2018లో స్థాపించినటువంటి ఏవిఆర్ ఫుడ్స్ అండ్ కాస్మోటిక్ సంస్థ గాడిదలను పెంచే ఓ ఫారం కూడా  మెయింటైన్ చేస్తోంది.  ఇక్కడ గాడిదలను పెంచి వాటి నుంచి పాలను సేకరించి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ సంస్థ ప్రొపెరైటర్ నాగమణి,  ఆమె భర్త కలిసి  గాడిద పాల ఉత్పత్తులను విదేశాలకు సైతం విక్రయిస్తున్నారు. 

 

 

ముఖ్యంగా  మిడిల్ ఈస్ట్ దేశాలు అయినటువంటి  ఒమన్, , ఖతార్ ,  దుబాయి, ఇరాన్, టర్కీ లాంటి  దేశాల్లో  గాడిద పాలతో చేసినటువంటి ఈ కాస్మోటిక్స్   సభ్యులకు చాలా డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.  అంతేకాదు గాడిదల ఫారం నిర్వహణ కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు.  దీంతో పాటు గాడిదలు నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులకు కూడా అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉందని మీరు చెబుతున్నారు.  తాజాగా  ఒమన్ దేశానికి చెందినటువంటి  ఒక సంస్థ తమతో ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని  ఏ వి ఆర్ ఫుడ్స్ అండ్ కాస్మోటిక్ సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

అంతే కాదు గాడిద  పాలతో చేసినటువంటి పొడికి కూడా చాలా డిమాండ్ ఉందని వీటిని అనేక ఔషధాల్లో సైతం వాడుతారని వీరు చెబుతున్నారు.  మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేందుకు వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.  గాడిదను సాధారణంగా ఒక  పనికిమాలిన జంతువుగా పరిగణిస్తూ ఉంటారు.  అలాంటి గాడిద నుంచి వీరు ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడం విశేషం. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios