మీరు మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ తరగతికి చెందినవారా, మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను వెతుకుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. మీరు స్వంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారా అయితే.. ఈ రోజు మేము మీ కోసం అలాంటి ఐడియాలను తీసుకువచ్చాము తెలుసుకోండి.
ఉద్యోగం కోసం చూస్తున్నారా, మీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదా, అయితే ఆదాయాన్ని పెంచుకోవడానికి చక్కటి మార్గాలను తెలుసుకుందాం. మీరు స్వంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లయితే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు నెలాఖరులో సంపాదించవచ్చు.
బొమ్మల వ్యాపారం:
ఇది తక్కువ మూలధన వ్యాపారం, దీనిని రూ. 30,000 ఖర్చుతో కూడా ప్రారంభించవచ్చు. మన దేశం ఇప్పటికే బొమ్మల దిగుమతిదారు. అందులోనూ చాలా బొమ్మలు చైనా నుండి దిగుమతి అవుతున్నాయి, కానీ ఇప్పుడు చైనాతో మన టెన్షన్ కొనసాగుతోంది. మేక్ ఇన్ ఇండియా వంటి కొత్త పథకాలపై భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మీరు బొమ్మల తయారీ మెషీన్ కొనుగోలు చేసి బొమ్మలను తయారు చేసుకోవచ్చు. తద్వారా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
వేస్ట్ మెటీరియల్ రీసైకిల్:
ఇది చాలా తక్కువ మూలధనంతో ప్రారంభించే బిజినెస్.వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసే వ్యాపారం. ఇది కేవలం 10 నుండి 20 వేల రూపాయలలో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో మీరు ప్రతి నెలా పెద్ద డబ్బు సంపాదించవచ్చు. దీని కోసం, మీరు మున్సిపల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ విభాగాలను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే ఈ విభాగాల నుంచి పెద్ద మొత్తంలో వ్యర్థ పదార్థాలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా, మీరు చాలా ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయవచ్చు. వాటిని మార్కెట్లో విక్రయించవచ్చు. ఈ వ్యాపారాలను ప్రారంభించడానికి, మీరు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.10 లక్షల వరకు రుణాన్ని కూడా పొందవచ్చు.
ఆన్ లైన్ బిజినెస్..
అలాగే తక్కువ పెట్టుబడితో చేయగలిగే మరికొన్ని వ్యాపారాల్లో ఆన్ లైన్ బిజినెస్ కూడా ఒకటి ఆన్ లైన్ బిజినెస్ లో మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని దుస్తులు చెప్పులు ఎలక్ట్రానిక్స్ హోల్సేల్ ధరకు కొనుగోలు చేసి ఈ కామర్స్ సైట్లో విక్రయించవచ్చు ఇందుకోసం మీరు జీఎస్టీ నెంబర్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది తద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ కామర్స్ సైట్లు మార్కెట్లో బాగా విస్తరిస్తున్నాయి ఈ నేపథ్యంలో మీరు ఒక షాపు ఏర్పాటు చేసుకోకుండానే ఇంటి వద్ద నుంచే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
