Business Ideas: ఈ కోర్సు నేర్చుకుంటే చాలు .. యోగా ద్వాారా నిరుద్యోగులు సైతం నెలకు లక్షల్లో సంపాదించే అవకాశం..

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే  నేడు ప్రపంచ యోగా దినోత్సవం ఈ సందర్భంగా ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు యోగా ట్రైనర్  అవడం ద్వారా వివిధ రూపాల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది.  అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Business Ideas: Just by learning this course, even unemployed people can earn lakhs per month through yoga MKA

భారతదేశానికి యోగా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చక్కటి గుర్తింపు లభిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ యోగా పట్ల అవగాహన పెంచుతున్నారు.  దీన్నే మీరు చక్కటి ఆదాయ మార్గంగా మార్చుకునే అవకాశం ఉంది.  మీరు యోగాను ఒక కెరీర్ ఆప్షన్ గా కూడా మార్చుకోవచ్చు.  ఇందుకోసం సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గా మీరు మారడం ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

ప్రపంచ యోగా దినోత్సవం కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ట్రైనర్లకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు, కార్పొరేట్ ఆఫీసులు ఇలా పలు చోట్ల యోగా ట్రైనర్లకు డివైడ్ పెరుగుతోంది. పలువురు ఉన్నత వర్గానికి చెందినవారు, పర్సనల్ యోగా ట్రైనర్లను సైతం నియమించుకుంటున్నారు.  అయితే మీరు యోగాను కెరీర్ ఆప్షన్ గా ఎంచుకున్నట్లయితే సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గా మారాల్సి ఉంటుంది. 

మన దేశంలో పలు సంస్థలు యోగా అభ్యాసం నేర్పిస్తున్నాయి. డిప్లమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.  ముఖ్యంగా న్యాచురోపతి ఇనిస్టిట్యూట్ లలో  యోగా డిప్లొమా తరగతులను నిర్వహిస్తున్నారు. . ఇలాంటి ఇనిస్టిట్యూట్ లలో యోగా ట్రైనింగ్ తీసుకొని సర్టిఫైడ్ పొందడం ద్వారా మీరు సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గా మారి మంచి ఆదాయం పొందే వీలుంది. 

అంతే కాదు మీరు యోగా ట్రైనింగ్ క్లాసులను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా విదేశీ విద్యార్థులకు సైతం మీరు యోగా క్లాసులను నేర్పించవచ్చు. 

ప్రస్తుతం అన్ని స్కూల్స్ కాలేజీల్లో యోగా ట్రైనర్లను నియమించుకుంటున్నారు. మీరు సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అవ్వడం వల్ల సులభంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది.  యోగా ట్రైనింగ్ క్లాసులను మీరు ఇనిస్ట్యూట్ ప్రారంభించ కూడా నేర్పించవచ్చు. ఇందుకోసం మీరు ఒక గదిలో ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొద్దిగా పెట్టుబడి పెట్టాలి. ఇక యోగ శిక్షణ పొందిన తర్వాత విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా యూరప్ వంటి దేశాల్లో యోగా ట్రైనర్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. తద్వారా మీరు విదేశాల్లో సైతం ఆదాయం పొందే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios