నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాలేదని ఖాళీగా కూర్చునే బదులు, చక్కటి వ్యాపారాలు చేసుకుంటే ప్రతినెలా ఉన్న ఊరిలోనే ఇంటివద్దె నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. అలాంటి మంచి వ్యాపార అవకాశాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. . ఈ వ్యాపారాలు చేయడం ద్వారా మీరు మీ గ్రామం కదలకుండానే, హాయిగా ఇంటి వద్ద ఉంటూనే ప్రతి నెల లక్షల్లో ఆదాయాన్ని సంపాదించే వీలుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మీకు వ్యవసాయ భూమి ఉందా, అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోళ్ల పెంపకం గురించి అందరికీ తెలిసిన వ్యాపారమే, కానీ కోళ్ల పెంపకంలో ఓ ప్రత్యేకమైన కోళ్ల జాతిని పెంచడం ద్వారా మీకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది, అవే కడక్ నాథ్ కోళ్ల పెంపకం. చూడ్డానికి పూర్తి నల్లగా ఉండేటువంటి కడక్ నాథ్ కోళ్లను తింటే అనేక పోషక విలువలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కడకనాథ్ కోళ్లు ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందని వీటిని తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి కోడిగుడ్లను కూడా చాలా ఖరీదు చేసి పెట్టి మరి కస్టమర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే కడక్ నాథ్ కోళ్లకు అంత డిమాండ్ ఉంటుంది.
కడక్ నాథ్ కోళ్ల విషయానికి వస్తే, సాధారణంగా కడకనాథ్ కోడి చికెన్ ధర దాదాపు 800 వరకు ఉంటుంది. హైదరాబాద్ మార్కెట్లో కడకనాథ్ చికెన్ ధర వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి నడకనాథ్ కోళ్లు పెంచితే ఎంత లాభం పొందవచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు.
కడకనాథ్ కోళ్లు ఎక్కువగా ఉత్తర భారత దేశంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ కడకనాథ్ కోళ్లను మనం చూడవచ్చు. ఈ కోళ్లు పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. దీని కూడా నల్లగానే ఉంటుంది. ఇటీవలే ఈ కడకనాథ్ కోళ్లను మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగా పెంచుతున్నారు. అంతే కాదు కస్టమర్లు సైతం కడకనాథ్ కోళ్ల మాంసం తినేందుకు ఇష్టపడుతున్నారు.
మీరు కడకనాథ్ కోళ్ల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, ముందుగా మీ స్థలంలో అర ఎకరం విస్తీర్ణంలో ఒక షెడ్డు నిర్మించుకోవాల్సి ఉంటుంది. సాధారణ నాటు కోళ్ల పద్ధతిలోనే వీటిని పెంచాల్సి ఉంటుంది. ఈ జాతి కోళ్లను మనం పెంచుకోవాలంటే కోడి పిల్లలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవడం మంచిది. మధ్యప్రదేశ్ లోని జబువా, ధార్ జిల్లాల్లో కడకనాథ్ కోడి పిల్లలు పెద్ద ఎత్తున లభిస్తాయి. వీటిని కాలమాసి అని కూడా అంటారు. కడక్ నాథ్ కోడి పిల్లల ధర సుమారు 60 రూపాయల నుంచి 70 రూపాయలు వరకు పలుకుతుంది. మధ్యప్రదేశ్ లోని జబూవా జిల్లాలో ఈ కోడి పిల్లలు లభిస్తాయని రైతులు చెబుతున్నారు. అయితే స్థానికంగా కూడా కొన్ని పౌల్ట్రీలు వీటిని తెప్పించి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు.
ఇక కడకనాథ్ కోళ్ల విషయానికి వస్తే వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మందులు వాడాల్సిన పనిలేదు కేవలం 7 నెలల వ్యవధిలోనే ఒక్కోడి కేజీన్నర వరకు పెరుగుతుంది సాధారణ బాయిలర్ కోడి తో పోల్చితే ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది అలాగే గుండె రోగులకు కూడా కడకనాథ్ కోడి మాంసం చాలా మంచిదని మైసూర్ కు చెందిన సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పేర్కొంటున్నారు అంతేకాదు కడక్ నాథ్ కోళ్లను తినడం వల్ల సెక్స్ సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు అందుకే ఈ కోళ్లకు ఎంత ధర ఉన్నా వెనుకాడకుండా తినేందుకు కష్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.
