Business Ideas: శానిటరీ వేర్ డీలర్ షిప్ ఎలా ఫొందాలి..ఈ బిజినెస్ లో ప్రతి ఏడాది ఎంత సంపాదించవచ్చు,
వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే, ఓ మంచి బిజినెస్ ఐడియా ద్వారా మీరు చక్కటి ప్రణాళికతో వ్యాపారం చేసినట్లయితే ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడి తోనే ప్రతి నెల ఆదాయం పొందే అవకాశం ఉంది.
శానిటరీ వేర్ లేదా బాత్రూం సామాన్ల వ్యాపారం ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. స్వంత శానిటరీ వేర్ వ్యాపారం ప్రాంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే నిజానికి శానిటరీ సామాను ఒక మంచి వ్యాపారం. మీరు మంచి మొత్తంలో లాభాలను పొందవచ్చు. మీరు ఈ వ్యాపారంలో చాలా త్వరగా మంచి లాభాలను చూడవచ్చు. శానిటరీవేర్ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎవరి దగ్గర మార్కెట్ డీలర్షిప్ తీసుకోవాలి వంటి అనేక విషయాలను తెలుసుకుందాం.
శానిటరీ వేర్ షోరూమ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి
మంచి లాభం పొందడానికి శానిటరీ వేర్ షోరూం ప్రారంభించే ముందు మార్కెట్లోని లీడింగ్ బ్రాండ్స్ గురించి తనిఖీ చేయాలి. అలాగే నిర్మాణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న ప్రదేశంలో మీరు శానిటరీ వేర్ షోరూం ప్రారంభిస్తే చక్కటి లాభాలను పొందే వీలుంది. శానిటరీ వేర్ షోరూమ్ ప్రారంభించే ముందు దానికి అనుబంధంగా ఒక గోడౌన్ కూడా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా షోరూం చాలా ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేసుకోవాలి. చేసుకోవాలి. చేసుకోవాలి. కమర్షియల్ స్పేస్ లో షాప్ తీసుకోవాలి. అలాగే మీకు సహాయకులుగా కొంతమంది పని వాళ్ళని కూడా ఉంచుకోవాలి. ప్రారంభ పెట్టుబడి కాస్త ఎక్కువగానే అవుతుంది. షాపు అద్దె, గోడౌన్ అద్దె బేరీజు వేసుకొని షోరూం ప్రారంభిస్తే మంచిది. ప్రారంభంలో పెట్టుబడి సుమారు 10 లక్షల నుంచి 30 లక్షల వరకూ ఉంటుంది. గోడౌన్ మీ షాపుకు సమీపంలో ఉండాలి. లేదా షాపు వెనుక గోడౌన్ ఉంటే ఇంకా మంచిది. మీకు స్వంత స్థలం ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది.
బ్రాండ్:
శానిటరీ వేర్ వ్యాపారం కోసం సరైన బ్రాండ్‌ను డీలర్ షిప్ ఎంచుకోవాలి. శానిటరీ వేర్ పరిశ్రమలో శానిటరీ వేర్ ఉత్పత్తులను అందించే అనేక బ్రాండ్లు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ శానిటరీవేర్ బ్రాండ్లు ఉన్నాయి. బ్రాండ్ ఎంపిక మీ వ్యాపారంలో లాభాలను నిర్ణయిస్తుంది. మన దేశంలో Asian Granito India Ltd, Texaro, Jaquar, Cera, Hindware, TOTO, Duravit, Parryware, Aquant, American Standard వంటివి ప్రముఖ బ్రాండ్లుగా మన దేశంలో ఉన్నాయి. మీరు ఆయా సంస్థలను నేరుగా ఆఫీసుకు వెళ్లి సంప్రదంచవ్చు. మీరు సింగిల్ బ్రాండెడ్ శానిటరీ వేర్ ఉత్పత్తులు లేదా వివిధ బ్రాండెడ్ శానిటరీ వేర్ ఉత్పత్తులతో కూడిన షోరూమ్‌ను తెరవవచ్చు. ఇది షోరూమ్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. నిజానికి, సింగిల్ బ్రాండెడ్ శానిటరీ వేర్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం మంచిది. మీరు ఒక బ్రాండ్‌ని ఏంచుకుంటే, ఆ బ్రాండ్ లేదా కంపెనీని సంప్రదించాలి బ్రాండ్‌ను ఎంచుకునే ముందు క్వాలిటీ, మార్కెట్, డిజైన్లను పరిశీలించి, ఆపై సరైన బ్రాండ్‌ను ఎంచుకోండి. పెట్టుబడి తగ్గుతుందని మార్కెట్లో వ్యాల్యూ లేని బ్రాండ్లను ఎంచుకోవద్దు.
పెట్టుబడి ఎంతంటే..
మీరు షోరూం ఏర్పాటు చేసే ఏరియాను బట్టి ప్రోడక్టులను అందుబాటులో ఉంచుకోవాలి. . ఉదాహరణకు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నట్లయితే మినిమం రిక్వైర్మెంట్ ఉన్న సానిటరీ వేర్ సామాన్లు దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. షోరూమ్ నగరం నడిబొడ్డున ఉంటే హై ఎండ్ వస్తువుల కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువలన, మీరు వ్యాపారంలో మంచి లాభం పొందుతారు. కానీ షోరూమ్ నగరం నడిబొడ్డున ఉన్నపుడు పెట్టుబడి, షోరూమ్‌కి అదనపు అడ్వాన్స్, షోరూమ్ అద్దె, అధిక కరెంట్ బిల్లు ఉంటాయి. మీరు ఉంచిన ఏర్పాటు, నగరం శివారు ప్రాంతంలో ఉన్న షోరూమ్ పెట్టుబడి. మరియు ఖర్చులు తక్కువగా ఉంటాయి కానీ నగరం నడిబొడ్డున ఉన్న షోరూమ్ సంఖ్యతో వ్యాపార కదలిక , కస్టమర్ల తగ్గుతుంది.
శానిటరీవేర్ ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తులు అయిన వాటర్ హీటర్, కుళాయిలు మొదలైనవి.అందుబాటులో ఉంచుకోవాలి. . కొన్ని కంపెనీలు అన్ని రకాల బాత్రూమ్ యాక్సెసరీలను అందిస్తాయి కానీ కొన్ని శానిటరీ వేర్ ఉత్పత్తులను విడిగా, టైల్స్ విడిగా, కుళాయిలు విడివిడిగా అందిస్తాయి.
ఇక లాభం విషయానికి వస్తే చాలా ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రతి ఏడాది శానిటరీ వేర్ ను పూర్తిగా మార్చేస్తుంటారు. అలాంటి ఫైవ్ స్టార్ హోటల్ లో మీరు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే ప్రతి ఏడాది మీకు వర్క్ లభించే అవకాశం ఉంది దీంతోపాటు కన్స్ట్రక్షన్ కంపెనీలు, మేస్త్రీలతో కూడా మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేస్తే మీకు ఆర్డర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ బిజినెస్ లో యావరేజీగా ప్రతీ ఏడాది రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ సంపాదించవచ్చు.