Asianet News TeluguAsianet News Telugu

Business Ideas: క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించడం ఎలా, ఎంత పెట్టుబడి పెట్టాలి. ఆదాయం ఎంత వస్తుంది..

క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా, అందుకు పెట్టుబడి ఎలా అని ఆలోచిస్తున్నారా, అయితే మీరు క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు సులువైన మార్గం తెలుసుకోండి..

Business Ideas How to start a catering business and how much to invest How much income
Author
First Published Dec 5, 2022, 10:49 AM IST

నేటి కాలంలో, చాలా మంది యువకులు ఉద్యోగం చేయడానికి బదులు సొంత వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే, దాని అతిపెద్ద సవాలు పెట్టుబడి సమకూర్చుకోవడమే, కానీ అందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన ముద్ర రుణమే పరిష్కారం, ప్రభుత్వ బ్యాంకుల నుంచి సులువైన మార్గంలో ఈ ముద్ర రుణాలను పొందవచ్చు. అంతేకాదు సులభ వాయిదాలతో మీరు రుణం తీర్చవచ్చు. మరి మీ పెట్టుబడితో ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా, క్యాటరింగ్ వ్యాపారం చాలా చక్కటి వ్యాపార అవకాశం. 

దీని కోసం మీరు శుభ్రమైన వంటగదిని కలిగి ఉండాలి. దీన్ని ప్రారంభించడానికి, మీకు పాత్రలు, గ్యాస్ సిలిండర్లు మొదలైనవి అవసరం. శ్రమ కూడా అవసరం అవుతుంది. ఇది పెద్ద బడ్జెట్ అవసరం లేని వ్యాపారం. అలాగే, ఈ వ్యాపారం ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రారంభ దశలో రూ. 50 వేల వరకూ పెట్టుబడి అవసరం అవుతుంది. మీరు దీని నుండి నెలకు 25-50 వేల రూపాయలు సంపాదించవచ్చు. ఆ తర్వాత వ్యాపారం పెరిగితే నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, నిర్వహించాలన్నా మార్కెట్‌పై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. క్యాటరింగ్ వ్యాపారం కూడా దీనికి మినహాయింపు కాదు. మీరు ఈ వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే, మీ సేవ గురించి ఆన్‌లైన్‌లో మరియు స్నేహితుల ద్వారా ప్రచారం చేయండి. వాట్సప్ లాంటి మీడియా ద్వారా, మీరు ఆర్డర్‌లను పొందవచ్చు.  నేడు చిన్న పార్టీల్లో కూడా మంచి క్యాటరర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు.

ఇక మీరు క్యాటరింగ్ కోసం ముందుగా మీ ఇంటి వద్దనే ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి.  దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి.  కమర్షియల్ గ్రైండర్,  కమర్షియల్ స్టవ్,  అవసరమైన మిక్సీలు,  పాత్రలు. పాలు, కూరగాయలు భద్రపరచుకోవడం కోసం  ఒక ఫ్రిజ్  అవసరం అవుతాయి.  అలాగే మీ క్యాటరింగ్ సర్వీసును చేరవేసేందుకు, మినీ  ట్రాన్స్ పోర్ట్ వెహికల్ కూడా అవసరం.  అన్నింటికన్నా ముఖ్యమైనది.  పని వాళ్లు చాలా అవసరం.  అలాగే  వంట తెలిసిన వాళ్ళు అయితే చాలా మంచిది.  నిజంగా మీరు కూడా కాస్త ప్రావీణ్యం సంపాదించి ఉంటే చాలా మంచిది. 

క్యాటరింగ్ తో పాటు కర్రీ పాయింట్ కూడా నడుపుతుంటే,  ఆర్డర్లు లేని సమయంలో మీకు ఆదాయ వనరు అవుతుంది. అలాగే క్యాటరింగ్ సర్వీసులో అత్యంత ముఖ్యమైనది, రుచి, నాణ్యత, శుభ్రత కావాలి. అప్పుడే మీరు మార్కెట్లో నెంబర్వన్ అవుతారు. 

ఇక కావాల్సిన సరుకుల కోసం  మీరు హోల్సేల్ మార్కెట్ లో  షాపింగ్ చేస్తే ఖర్చు ఆదా అవుతుంది.  నాణ్యమైన సరుకులను కొనుగోలు చేయాలి.  అప్పుడే రుచిలో తేడా రాదు.  క్యాటరింగ్ సర్వీస్ పబ్లిసిటీ అంటే,  కేవలం  మౌత్ పబ్లిసిటీ ద్వారానే  ఎక్కువగా వర్కవుట్ అవుతుంది.  అందుకు మీ పనితీరే ముఖ్యం.  మీరు ఎంత నాణ్యంగా రుచిగా,  తక్కువ  ఖర్చుతో అందుబాటులో  ఉంచుతారో అప్పుడు మీకు ఆర్డర్లు పెరుగుతాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios