Asianet News TeluguAsianet News Telugu

Business Ideas: బాక్స్ క్రికెట్ బిజినెస్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి. నెలకు ఎంత ఆదాయం వస్తుంది..

వ్యాపారం చేయడమే లక్ష్యమా అయితే  మారుతున్న టెక్నాలజీ యుగంలో లో కొత్త తరహా వ్యాపారాల వైపు దృష్టి సారిస్తే చక్కటి లాభాలను అందుకునే అవకాశం ఉంది.  తక్కువ పెట్టుబడి తో వినూత్నమైన వ్యాపారాలలో వైపు దృష్టి సారిస్తే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.

Business Ideas How Much to Invest in Box Cricket Business How much income per month
Author
First Published Nov 17, 2022, 11:51 AM IST

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది.  ఇందుకోసం చాలామంది జిమ్, యోగా క్లాసులకు రెగ్యులర్ గా వెళ్తున్నారు. అయితే రెగ్యులర్ గా జిమ్ యోగా కి వెళ్లడం అంత సాధ్యంకాకపోవచ్చు కొద్దికాలం తర్వాత మీకు బోర్ కొట్టేస్తోంది.  అలాంటి సమయంలోనే ఏదైనా ఒక ఆట ఆడితే అటు శారీరక వ్యాయామంతో పాటు  చక్కటి మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. 

క్రికెట్, వాలీబాల్,  ఫుట్ బాల్,  బాస్కెట్ బాల్ లాంటి ఆటలు ఆడటం ద్వారా అటు ఆరోగ్యంతో పాటు. మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అయితే ప్రస్తుతం సిటీలో లో మీకు ఆడుకునేందుకు ఖాళీ ప్రదేశాలు దొరకడం దాదాపు అసాధ్యమే.  ఇక రోడ్లపై ఆడుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  మరి ఏదైనా ఆట ఆడాలంటే ఖాళీ స్థలం కావాలి కదా అని ఆలోచిస్తున్నారా.  మీ సౌకర్యం కోసమే ప్రస్తుతం ఖాళీ స్థలాల్లో నెట్స్ వేసి.  బాక్స్ క్రికెట్ కాన్సెప్ట్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. 

ఈ బాక్స్ క్రికెట్ కోసం ముందుగా మీకు కావాల్సింది ఒక ఖాళీ ప్రదేశం, లేదా విశాలమైన రూఫ్ టాప్ మీద కూడా బాక్స్ క్రికెట్ సెటప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం చుట్టూ పోల్స్ ఏర్పాటు చేసి,  వాటిని కలుపుతూ మందపాటి నెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. వీటి లోపల.లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.  అలాగే కాంక్రిట్ ఫ్లోరింగ్ తో పాటుగా,  సింథటిక్ గ్రాస్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువ అయినప్పటికీ మంచి క్వాలిటీ,  ఫీల్డ్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల,  మీకు భవిష్యత్తులో ఖర్చు తగ్గుతుంది. ప్రారంభంలో మీకు దాదాపు రూ. 15 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.

ఇక ఈ క్రికెట్ నెట్స్ ను ఏర్పాటు చేసుకున్న తర్వాత,  పబ్లిసిటీ ఇవ్వడం  తప్పనిసరి. ఇందు  కోసం న్యూస్ పేపర్లలో అడ్వర్టయిజ్ మెంట్, పాంప్లెట్స్, డిజిటల్ మీడియా ద్వారా  పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. అలాగే  స్కూలు పిల్లలకు క్రికెట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ కూడా ఇందులో ఏర్పాటు చేసుకోవడం ద్వారా చక్కటి స్థిరమైన ఆదాయం సంపాదించుకోవచ్చు. 

 సాధారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు,  అలాగే కాలేజ్ ఫ్రెండ్స్,  ఈ మధ్యకాలంలో ఈ బాక్స్ క్రికెట్ ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  అలాంటి వారికి మీ ఫీల్డ్ ను  అద్దెకు ఇవ్వవచ్చు.  వారికి క్రికెట్ బ్యాట్ లు బాల్స్ ఇతర ఉపకరణాలను అద్దెకు ఇవ్వవచ్చు. 

బాక్స్ క్రికెట్ ద్వారా గంటల చొప్పున డబ్బు వసూలు చేయవచ్చు.  రాత్రివేళ కూడా అనుమతి పొంది ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రికెట్ ఆడే ఏర్పాటు చేస్తే,  చాలామంది వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు.  అంతేకాదు  వచ్చిన వారి కోసం ఒక ఫుడ్ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తే,  తింటూ ఎంజాయ్ చేస్తారు.  శివరాత్రి వంటి పండుగలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో టోర్నమెంట్లను  ఏర్పాటుచేసి, ప్రైజ్ మనీ ఇవ్వడం ద్వారా చాలామంది పాల్గొనే అవకాశం ఉంది.  ఎంట్రీ ఫీజు ద్వారా మీరు ఆదాయం సంపాదించుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios