Asianet News TeluguAsianet News Telugu

Business Ideas: కాలేజీ డ్రాపౌట్ అయ్యాడు..టీ కొట్టు పెట్టి నెలకు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు..యువకుడి విజయగాథ

బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ అన్నాడో సినీ కవి...నిజమే జీవితంలో డబ్బు సంపాదించాలంటే కేవలం చదువు ఉంటే సరిపోదు దాంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలి. ఓ కాలేజీ డ్రాపౌట్ చిన్న టీ కొట్టు పెట్టి నెలకు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు. అతని విజయగాథ తెలుసుకుందాం. 

Business Ideas He was a college dropout He is earning 5 crores
Author
First Published Nov 8, 2022, 11:36 PM IST

జీవితం ఏ క్షణంలోనైనా మలుపు తిరగవచ్చు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి చదువుతో సంబంధం లేదు కేవలం తమ తెలివితేటలతో ఎంతో మంది కోటీశ్వరులు గా మారడమే కాక నలుగురికి ఆదర్శంగా నిలిచారు.  

అకడమిక్ లైఫ్‌లో ఫెయిల్ అయ్యామనే చిన్న కారణానికి జీవితాలను ముగించుకున్న వారి కథలు మనం చూశాం, చదివాం. అయితే విదేశాల్లో బీబీఏ కోర్సు పూర్తి చేయలేని ఓ డ్రాపౌట్ విద్యార్థి టీ దుకాణం తెరిచి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఆయన విజయగాథ ఒక తరానికి స్ఫూర్తిదాయకం. 

విదేశాల్లో విజయవంతమైన ఈ యువ వ్యాపారవేత్త భారతీయ సంతతికి చెందిన సంజిత్ కొండా. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో 'టీ దుకాణం' తెరిచి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఈ వెంచర్‌ను ప్రారంభించే ముందు, సంజిత్ ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేయడంలో విఫలమై డ్రాపౌట్ గా మిగిలాడు.  

BBA పూర్తి చేయలేక, సంజిత్ కొండా మెల్‌బోర్న్‌లో 'డ్రాపౌట్ చాయ్‌వాలా' అనే టీ దుకాణాన్ని ప్రారంభించాడు. కాఫీని ఇష్టపడే మెల్‌బోర్న్‌లో టీ షాప్ తెరవడం సంజిత్ పాలికి అంత తేలికైన పని కాదు. నాకు చిన్నప్పటి నుంచి టీ అంటే ఇష్టం. అందుకే ‘డ్రాప్ అవుట్ చాయ్ వాలా’ ఆలోచన నాకెంతో నచ్చింది’’ అని సంజిత్ అన్నారు. 

అదే సందర్భంలో సంజిత్‌కు సహాయానికి వచ్చిన ఓ ప్రవాస భారతీయుడు. ఆ పెట్టుబడిదారుడి సహాయంతో సంజిత్ టీ అమ్మే వ్యాపారం ప్రారంభించాడు. సంజిత్ 'డ్రాప్ అవుట్ చాయ్ వాలా' పేరుతో ఒక దుకాణాన్ని తెరిచి, టీతో పాటు సమోసాలు కూడా విక్రయించడం ప్రారంభించాడు, ఇది మెల్‌బోర్న్‌లోని భారతీయులను మాత్రమే కాకుండా స్థానికులను కూడా ఆకర్షించింది. 'డ్రాప్ అవుట్ చాయ్ వాలా' ప్రభావం 

'డ్రాప్ అవుట్ చాయ్ వాలా' దుకాణంలో, భారతీయులు 'బాంబే కట్టింగ్' టీని ఇష్టపడతారు, ఆస్ట్రేలియన్లు కూడా 'మసాలా చాయ్'ని ఇష్టపడతారు. అన్ని పన్నులు తీసివేసి, అన్ని ఖర్చులు చెల్లించిన తర్వాత, వచ్చే నెలలో నా ఆదాయం సుమారు రూ. 5.2 కోట్లు అవుతుందని సంజిత్ తెలిపారు. 

'డ్రాప్ అవుట్ చాయ్ వాలా' భారతదేశం నుండి టీ పొడిని దిగుమతి చేసుకుంటుంది. అలాగే, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన విద్యార్థులను పని కోసం నియమించుకున్నారు. అక్కడి ఖర్చులకు ఈ విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. మొదట్లో సంజిత్‌ చదువు మానేశాడన్న వార్త తెలిసిన వెంటనే అతడి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇప్పుడు నేను వ్యాపారం ఎలా ప్రారంభించానో, ఎక్కడికి చేరిందో చూసి గర్వపడుతున్నాడు సంజిత్ కొండా. 

Follow Us:
Download App:
  • android
  • ios