Business Ideas: నిరుద్యోగులకు బంపర్ చాన్స్.. కరీంనగర్ డెయిరీతో కలిసి ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 2 లక్షల ఆదాయం
నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులు చక్కటి బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా డైరీ బిజినెస్ లో చక్కటి ఆదాయం పొందవచ్చు. మీరు కూడా డైరీ బిజినెస్ ద్వారా పాల వ్యాపారంలో రాణించాలనుకుంటే మీ గ్రామంలోనే మంచి ఆదాయం పొందే వీలుంది.
ప్రస్తుతం హర్యానాలో లభించే గేదెలను పెంచడం ద్వారా మంచి పాల దిగుమతిని రైతులు సాధిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ డైరీ కంపెనీలతో జతకట్టడం ద్వారా నిరంతరం ఆదాయంతో పాటు అనేక లాభాలు కూడా దక్కుతున్నాయి తెలంగాణలోని ప్రముఖ డైరీ అయినటువంటి కరీంనగర్ డైరీ కంపెనీ పాడి రైతులకు చక్కటి ఆదాయం అందించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా ముందుకు వెళుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఇలాంటి డైరీ కంపెనీలతో జతకట్టి పని చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం కరీంనగర్ డైరీ కంపెనీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వాటి ద్వారా రైతులు ఎలా లబ్ధి పొందవచ్చు తెలుసుకుందాం.
కరీంనగర్ డైరీలో సభ్యత్వం తీసుకున్న పాడి రైతులకు అనేక సంక్షేమ పథకాలను సంస్థ అందజేస్తుంది అవేంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం
>> ఎవరైతే పశువులను కొనుగోలు చేయాలని డైరీ ఫార్మ్ ప్రారంభించాలని అనుకుంటున్నారో వారికి 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు కరీంనగర్ డైరీ రుణ సదుపాయం అందిస్తోంది
>> అంతే కాదు పంజాబ్ హర్యానా వంటి ఇతర రాష్ట్రాల నుంచి పాడి పశువులను కొనుగోలు చేసి తెచ్చుకున్న వారికి ఆ పశువుల ఇన్సూరెన్స్ లో దాదాపు 90 శాతం వరకు రాయితీ కల్పిస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకునే పశువుల రవాణా ఖర్చులో సుమారు 90% రాయితీని కరీంనగర్ డైరీ అందిస్తోంది
>> అంతేకాదు ప్రమాదవశాత్తు పాడిపశువులు మరణిస్తే 5000 నుంచి ఏడు వేల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని సంస్థ అందిస్తోంది
>> దీంతోపాటు పశువులకు ఉచిత వైద్యం కేవలం 100 రూపాయలకే పశువులకు కృత్రిమ గర్భధారణ వంటి సదుపాయాలను కూడా సంస్థ అందిస్తోంది
>> దీంతోపాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి పశువైద్య క్యాంపులను సంస్థ నిర్వహిస్తోంది. అలాగే ఏటా ఒకసారి మెగా పశు వైద్య క్యాంపు ని సైతం నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తోంది.
>> అలాగే పశువుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ చేయవలెను సైతం కరీంనగర్ డైరీ ఏర్పాటు చేసింది ఇంటివద్దె కేవలం రూ. 250 ఫీజుతో మందులతో సహా చికిత్సను అందిస్తోంది
.>> పశువులకు సోకే అనేక వ్యాధులకు సంబంధించిన టీకాలపై సంస్థ 50% సబ్సిడీ అందిస్తోంది
>> అలాగే పాడి రైతు కుటుంబాలకు చెందిన అమ్మాయిల పెళ్లి సందర్భంగా కానుకగా కళ్యాణమస్తు పేరిట బంగారు పూస్తే వెండిమట్టలను అందిస్తోంది
>> అంతేకాదు బాడీ రైతు భరోసా పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ పథకంలో చేరిన రైతు, లేదా అతని భార్య ప్రమాదవశాత్తు మరణిస్తే 50 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
>> పాడి రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తోంది
>> పాల నిధి పథకం ప్రకారం 60 సంవత్సరాలు దాటిన పాడి రైతులకు ప్రతినెల పెన్షన్ లేదా ఏక మొత్తంలో డబ్బు చెల్లించేందుకు కరీంనగర్ డైరీ ఏర్పాట్లు చేసింది.
>> అంతేకాదు రుణం తీసుకున్న రైతు మరణిస్తే రైతు సంక్షేమ నిధి కింద 30 వేల రూపాయలు తక్షణ సహాయం అందించేందుకు కరీంనగర్ డైరీ నిర్ణయం తీసుకుంది.
>> పాడి రైతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తే, వారికి విద్యా ప్రోత్సాహకం కింద పదివేల నుంచి 5000 వరకు బహుమతులు అందిస్తోంది.
>> అలాగే పాల కేంద్ర భవనం నిర్మించాలని నిర్ణయిస్తే, రూ. 50,000 నుండి లక్ష రూపాయల వరకు చేయూత అందిస్తోంది.
>> తక్కువ ధరలకు నాణ్యమైన ఎరువులు సరఫరా, .పశు ఆరోగ్యానికి 25 శాతం సబ్సిడీ పై లవణ మిశ్రమం సరఫరా
>> ప్రమాద వశాత్తు పాడి రైతు మరణిస్తే దహన సంస్కారాలకు రూ. 5,000 చొప్పున చేయూత.
>> 50 శాతం సబ్సిడి పై పశు గ్రాస విత్తనాలను సైతం సరఫరా చేస్తోంది.