కరోనా వైరస్ మహమ్మారి మనకు నేర్పించిన ఒక గొప్ప విషయం ఏంటంటే సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత ఉండటం. గతంలో విధించిన లాక్ డౌన్, ఇతర కష్టాలు ఒకరికొకరు సహాయపడటానికి, జీవితంలో ముందుకు సాగడానికి ప్రజలను ఒకచోట చేర్చింది.

అయితే ఇటీవల యు.కెలోని బర్గర్ కింగ్ సోషల్ మీడియా ట్విట్టర్ ట్వీట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది.

అమెరికన్  ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్  కింగ్ ఉద్యోగాలు కాపాడటానికి సోమవారం యు.కెలోని తన కస్టమర్లను మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి, పాపా జాన్స్, టాకో బెల్స్ వంటి దాని పోటీదారుల నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వమని విజ్ఞప్తి చేసింది.  ఈ విషయాన్ని అధికారిక సోషల్ మీడియా ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ పోస్ట్  చేసింది.  

also read ముకేష్ అంబానీ లక్ష కోట్ల సంపద ఆవిరి.. 6 నుంచి 9వ ప్లేసుకు రిలయన్స్ అధినేత.. ...

 కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల దేశంలో విధించిన రెండవ లాక్ డౌన్(నవంబర్ 5 నుండి) కారణంగ స్థానిక ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లకు మద్దతు ఇవ్వడానికి గ్లోబల్ కంపెనీ యు.కె ఆర్మ్ వినియోగదారులను కోరింది. కొత్త ఆంక్షల వల్ల రెస్టారెంట్లు, బార్‌లు, ఫుడ్ సర్వీసెస్  డిసెంబర్ వరకు మూసివేయవలసి ఉంటుంది.

"మేము ఇలా చేయమని మిమ్మల్ని అడుగుతామని మేము ఎప్పుడూ అనుకోలేదు,  కాని వేలాది మంది సిబ్బందిని నియమించే రెస్టారెంట్లకు ఈ సమయంలో నిజంగా మీ సహకారం అవసరం" అని బర్గర్ కింగ్ పోస్ట్ చేసింది.

"కాబట్టి మీరు సహాయం చేయాలనుకుంటే హోం డెలివరీ, టేక్ అవే లేదా డ్రైవ్ త్రూ ద్వారా రుచికరమైన భోజనానం పొందవచ్చు" అని  తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా యు.కెలోని హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది, నవంబర్ 5 నుండి కొత్త ఆంక్షలు వ్యాపారాలను మరింత దిగజారుస్తాయని భావిస్తున్నారు. మార్చిలో మొదటి లాక్ డౌన్ సమయంలో రెస్టారెంట్లను మూసివేసారు, తరువాత జూలైలో తిరిగి ఓపెన్ చేశారు.

 బర్గర్  కింగ్ చేసిన పోస్ట్ ఫేస్‌బుక్‌లో 40వేల షేర్లు, ట్విట్టర్‌లో 1.1 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. గ్లోబల్ చైన్‌ల కంటే సొంత వ్యాపార యజమానులకు, రెస్టారెంట్ యజమానులకు ఎక్కువ మద్దతు అవసరమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్ తక్కువ సమయంలోనైనా వైరల్ అయ్యింది, నెటిజన్ల నుండి భారీ ప్రేమ, ప్రశంసలను పొందింది.