అమెజాన్ నుంచి బంపర్ ఆఫర్, బ్యాంకుకు వెళ్లకుండా..ఇంటి వద్దే 2000 రూపాయల నోట్లను మార్చుకునే చాన్స్..ఎలాగంటే..?
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ ఇంటి వద్దే 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ వినూత్నమైన సౌకర్యం కల్పించింది. కస్టమర్లు సుమారు 50,000 రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోటులను ఈ సదుపాయం ద్వారా మార్చుకోవచ్చు.
దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది ఈ నేపథ్యంలో చాలామంది కస్టమర్లు ఈ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారానో అలాగే మార్పిడి చేసుకోవడం ద్వారా 2000 రూపాయల నోట్లను తిరిగి ఇచ్చేస్తున్నారు. మరికొందరు బంగారం సహా ఇతర లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వెళ్లే సమయం లేని వారికి, తమ ఇంటి వద్దకే ఈ పెద్దనోట్లను మార్చుకునే వెసులుబాటును Amazon Pay కల్పించింది. 2000 రూపాయల నోట్లు Amazon Pay బ్యాలెన్స్‌గా Amazon వాలెట్ లో జమ చేయనున్నారు. అప్పుడు మొత్తం డిజిటల్ వాలెట్‌కు వెళుతుంది. ఈ మొత్తాన్ని Amazonలోని ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. అమెజాన్ వస్తువుల హోమ్ డెలివరీపై కూడా చెల్లించవచ్చు.అమెజాన్ కొత్త క్యాష్ లోడ్ ఫీచర్ కింద నిమిషాల వ్యవధిలో రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చు.
2000 కరెన్సీలను మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి Amazon యొక్క డోర్‌స్టెప్ సర్వీస్ పెద్ద ఉపశమనంగా మారింది. ఒక కస్టమర్ నెలకు రూ.50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. Amazon Pay యొక్క డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా వినియోగదారులు డిజిటల్ లావాదేవీల కోసం 2000 రూపాయల నోట్లను సులభంగా మార్చుకోవచ్చని తెలిపింది. వినియోగదారులు రిటైల్ స్టోర్‌లలో బార్‌కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఈ డబ్బును ఇతర ఖాతాలకు, కస్టమర్ ఖాతాలకు బదిలీ చేయవచ్చు.
ఈ సదుపాయాన్ని పొందేందుకు, వినియోగదారులు Amazon యాప్‌లో వీడియో KYCని పూర్తి చేయాలి, దీనికి పది నిమిషాల సమయం పడుతుంది. మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెలామణి నుండి 2,000 రూపాయల కరెన్సీ నోట్ల ఉపసంహరణను ప్రకటించింది; ప్రస్తుతం ఉన్న నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు లేదా బ్యాంకుల్లో మార్చుకోవాల్సి ఉంటుంది.
కిడ్డీ బ్యాంకు వీడియో వైరల్
2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇన్ స్టాగ్రాంలో ఇద్దరు చిన్నారులు తమ వద్ద ఉన్న పిగ్గీ బ్యాంకును బద్దలు కొట్టి అందులోని 2000 నోట్లను బయటకు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను thevasimbuilder Instagram ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో మట్టితో చేసిన కిడ్డీ బ్యాంకును బద్దలు కొట్టడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. కిడ్డీ బ్యాంకులో నోట్ల కట్టలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో చూసిన పలువురు యూజర్లు పిల్లలకు అంత డబ్బు ఇవ్వవద్దని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల కోసం అంత డబ్బు ఎందుకు అని కొందరు విమర్శించారు. ఒక యూజర్ తన బ్యాంకు అకౌంట్లో కూడా అంత డబ్బు లేదని వాపోయాడు.. ఆర్‌బీఐ సూచనల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకులకు తిరిగి ఇచ్చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు.