BSNL న్యూ ఇయర్ ఆఫర్: రూ.277కే 120GB డేటా!
2025 నూతన సంవత్సరం సందర్భంగా BSNL తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.277కే 120GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ, ఇతర సౌకర్యాల గురించి తెలుసుకుందాం రండి.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తన వినియోగదారులు మెరుగైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. ఇప్పటికే 4G సేవలు వేగంగా అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థ త్వరలోనే 5G సేవలను ప్రారంభించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను ప్రకటిస్తోంది.
జియో, ఎయిర్‌టెల్, VI వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు గత జూలైలో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. దీంతో చాలా మంది BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. BSNL తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే ఆ సంస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతోంది. టారిఫ్ ప్లాన్ల ధరల పెంపు వల్ల జియో, ఎయిర్‌టెల్, VI వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ కస్టమర్లను కోల్పోతున్నారు. వారంతా బీఎస్ఎన్ఎల్ లోకి చేరుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ లోకి చేరారని ఆ సంస్థ ప్రకటించింది.
వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ వారికి 4G, 5G సేవలను అందించేందుకు త్వరలోనే వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం BSNL నూతన సంవత్సర ఆఫర్‌ను ప్రకటించింది. ఆ ఆఫర్ ఏంటంటే..
BSNL రూ. 277 ప్లాన్
BSNL పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త ప్లాన్ ధర రూ.277. ఇందులో 60 రోజుల వ్యాలిడిటీతో పాటు 120 GB డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 GB డేటా మీరు వాడుకోవచ్చన్న మాట. డైలీ డేటా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకు తగ్గుతుంది. ఈ ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని BSNL ప్రకటించింది.
5G సేవ 2025లో ప్రారంభం
BSNL 4G, 5G సేవలు రెండూ కూడా 2025లోనే ప్రారంభమవుతాయని TCS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ N. గణపతి సుబ్రమణ్యం ప్రకటించారు. ఇంతకుముందు కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ మే 2025 నాటికి లక్ష చోట్ల 4G నెట్‌వర్క్‌ను BSNL ప్రారంభిస్తుందని చెప్పారు. ఆ తర్వాత జూన్ 2025లో 5G నెట్‌వర్క్ ప్రారంభమవుతుందని తెలిపారు.
BSNLకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న టాటా కంపెనీ ప్రస్తుతం 4G సేవలు వేగంగా అందించేందుకు కృషి చేస్తోంది. 4G, 5G సేవలు సరైన సమయంలో ప్రారంభమవుతాయని TCS హామీ ఇచ్చింది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది BSNL వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే విషయం. ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయని, నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తవుతాయని TCS తెలిపింది.