బీఎస్ఎన్ఎల్ నుంచి సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. ఒక్క ప్లాన్‌తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా, ఆ కస్టమర్లకి మాత్రమే..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్) తన వినియోగదారుల కోసం సినిమా ప్లస్ అనే కొత్త ఓవర్ ది టాప్ (ఓటీటీ)ని ప్రకటించింది. దీని రీచార్జ్, ఇతర ప్లాన్ల వివరాలను చూస్తే :

BSNL announces Cinemaplus OTT service for its broadband customers, details here ksp

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్) తన వినియోగదారుల కోసం సినిమా ప్లస్ అనే కొత్త ఓవర్ ది టాప్ (ఓటీటీ)ని ప్రకటించింది. టెలికాం టాక్ అనే సంస్థ నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఓటీటీకి సంబంధించి ప్రత్యేక ప్యాక్‌లను ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. వీటిలో నచ్చిన దానిని కొనుగోలు చేసి వినియోగదారులు తమకు ఇష్టమైన టీవీ షోలు, సినిమాలను చూసి ఆనందించవచ్చు. ఈ ఓటీటీ సేవల కోసం Lionsgate, ShemarooMe, Hungama, EpicOn వంటి ఫ్లాట్‌ఫాంలతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకుంది. 

ఇక ఆఫర్లు, ప్యాక్‌ల విషయానికి వస్తే :

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ :

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ అనేది గతంలో అందరికి సుపరిచితమైన యుప్‌టీవీ స్కోప్ రీబ్రాండెడ్ వెర్షన్. ఈ ప్లాన్ ధర రూ.249. సినిమా ప్లస్ వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా మరికొన్ని రకాల ప్లాన్‌లను అందిస్తోంది. సినిమా ప్లస్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఓటీటీ విభిన్న కలయికల ఆధారంగా వినియోగదారులకు మూడు ప్లాన్‌లను అందిస్తోంది. అవి బేస్ ప్లాన్ రూ.49తో మొదలై రూ.249 వరకు వున్నాయి. 

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్:

రూ.49తో మొదలయ్యే ఈ బేస్ ప్లాన్‌ Lionsgate, ShemarooMe, Hungama, EpicOnని అందిస్తుంది. గతంలో ఈ ప్లాన్ ధర రూ.99

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ ఫుల్ ప్యాక్:

ఈ ప్లాన్‌లో జీ4 ప్రీమియం, సోనీలివ్ ప్రీమియం, యుప్ టీవీ, హాట్‌స్టార్‌లు వుంటాయి. ఈ ప్లాన్ ధర రూ.199

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ ప్రీమియం ప్యాక్:

ఈ ప్రీమియం ప్యాక్ ధర రూ.249.. ఇందులో జీ5 ప్రీమియం, సోనీలివ్ ప్రీమియం, యుప్ టీవీ  Lionsgate, ShemarooMe, Hungama, Hotstarలు వుంటాయి.

సినిమాప్లస్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది:

సినిమాప్లస్‌ని ఉపయోగించుకోవడానికి, వినియోగదారులు యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్‌ని కలిగి ఉండాలి. అనంతరం వారికి నచ్చిన ప్లాన్‌లలో ఒకదాన్ని యాక్టివేట్ చేయాలి. ప్లాన్ యాక్టివేట్ అయిన తర్వాత, అన్ని సబ్‌స్క్రిప్షన్‌లు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో అది ముడిపడి ఉంటుంది. యాక్టివేట్ అయిన ప్లాన్‌లో భాగమైన ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి గాను ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios