Asianet News TeluguAsianet News Telugu

మొదటిసారి 50 వేల మార్క్ దాటిన సెన్సెక్స్.. దేశీయ మార్కెట్లపై అమెరికా కొత్త అధ్యక్షుడి సానుకూల ప్రభావం..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్ 223.17 పాయింట్ల (0.45 శాతం) లాభంతో 50,015.29 వద్ద ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 63 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 14,707.70 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 50,000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.
 

bse sensex nse nifty share market : sensex nifty indian indices opened highe sensex above 50000 for the first time
Author
Hyderabad, First Published Jan 21, 2021, 3:52 PM IST

నేడు వారంలోని నాల్గవ ట్రేడింగ్ రోజున అంటే గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ అత్యధిక స్థాయిలో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్ 223.17 పాయింట్ల (0.45 శాతం) లాభంతో 50,015.29 వద్ద ప్రారంభమైంది.

అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 63 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 14,707.70 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 50,000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.

జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ విజయం సానుకూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లో కనిపిస్తుంది. యుఎస్‌లో తాజా ఉద్దీపన ప్యాకేజీ అంచనా ప్రపంచ స్టాక్ మార్కెట్లను పెంచింది.

అమెరికాలో కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ప్రమాణ స్వీకారం తరువాత అంతర్జాతీయ మార్కెట్లలో అద్భుతమైన పెరుగుదలను నమోదు చేసింది. గురువారం రోజున కొరియా కోస్పి ఇండెక్స్ 0.92 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 0.18 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ కూడా 1 శాతం, జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.90 శాతం పెరిగాయి.

మరోవైపు అమెరికన్ మార్కెట్లలో నాస్డాక్ ఇండెక్స్ 1.97 శాతం, ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 1.39 శాతం పెరిగాయి. యూరోపియన్ మార్కెట్ కూడా పెరుగుదలను నమోదు చేసింది. ఎన్‌ఎస్‌డిఎల్‌ ప్రకారం, జనవరిలో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ .20,236 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

 కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ తీవ్రంగా పోరాడుతోంది. ఇండియాలో టీకా గురించి సానుకూల వార్తలతో మార్కెట్ వృద్ధి చెందుతోంది.

ఫిబ్రవరిలో ప్రవేశపెటానున్న కేంద్ర బడ్జెట్ గురించి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే చాలా మంది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈసారి బడ్జెట్ కరోనా కారణంగా ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. ఈ కారణంగా మార్కెట్ ఒడిదుడుకులుగా కొనసాగవచ్చు. అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు.

మార్కెట్ ఎప్పుడు రికార్డును బద్దలు కొట్టింది  ?
మార్చిలో కనిష్ట స్థాయికి చేరుకున్న తరువాత, సెన్సెక్స్ అక్టోబర్ 8న 40 వేలు దాటి 40182 కు చేరుకుంది. 
తరువాత సెన్సెక్స్ నవంబర్ 5న 41,340 వద్ద ముగిసింది. 
నవంబర్ 10న ఇంట్రాడేలో ఇండెక్స్ 43,227 కు పెరిగింది. 
నవంబర్ 1న  44180 స్థాయికి చేరుకుంది. 
డిసెంబర్ 4న ఇది 45000 మార్కును దాటి 45079 వద్ద ముగిసింది. 
డిసెంబర్ 11న సెన్సెక్స్ 46 వేలకు పైన అంటే 46099 వద్ద, డిసెంబర్ 14న 46,253.46 పాయింట్ల వద్ద ముగిసింది. అప్పుడు  నిఫ్టీ కూడా ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 13558.15 పాయింట్లకు చేరుకుంది. 
డిసెంబర్ 28న సెన్సెక్స్ 47353 వద్ద ఎగిసి ముగిసింది. 
జనవరి 4న, సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పి , మొదటిసారి 48000 దాటి 48176.80 వద్ద ముగిసింది.
బిఎస్ఇ సెన్సెక్స్ జనవరి 11న ఆల్-టైమ్ హై 49269.32 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ జనవరి 11 తర్వాత మళ్ళీ జనవరి 21 న అంటే నేడు  అత్యధిక స్థాయిలో ప్రారంభమైంది. సెన్సెక్స్ 223.17 పాయింట్ల లాభంతో 50,015.29 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 50,000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.

 నేడు ప్రారంభంలో  నెస్లే ఇంట్రా ఇండియా, ఎం అండ్ ఎం, టిసిఎస్ మరియు హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్, ఎన్‌టిపిసి, టైటాన్ షేర్లు  గ్రీన్ మార్క్ మీద ఉన్నాయి.

సెన్సెక్స్ ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 211.40 పాయింట్ల (0.42 శాతం)తో  50,003.52 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 146 పాయింట్లతో (1.00 శాతం) పెరిగి 14,790.70 వద్ద ఉంది.

బుధవారం గ్రీన్ మార్క్ మీద ముగిసిన స్టాక్ మార్కెట్ 
బుధవారం నాడు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల తరువాత గ్రీన్ మార్క్ మీద ముగిసింది. సెన్సెక్స్ 393.83 పాయింట్ల బలమైన లాభంతో అంటే 0.80 శాతం పెరిగి 49792.12 స్థాయిలో ముగిసింది.  నిఫ్టీ 123.55 పాయింట్ల (0.85 శాతం) లాభంతో 14644.70 వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్-నిఫ్టీ యొక్క అత్యధిక స్థాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios