ఆడవారు అలంకార ప్రియులని.. ఇందుకోసం వారు ఎక్కువగా షాపింగ్‌ అంటే ఇష్టపడుతుంటారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఇటీవల అబ్బాయిల్లోనూ సౌందర్య పిపాస పెరిగిపోతోంది. అందరిలోనూ తము అందంగా ఉండాలన్న కాంక్ష వారిలోనూ ఎక్కువవుతోందని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. అబ్బాయిలే ఎక్కువగా షాపింగ్‌ చేస్తారట. ఈ విషయాలన్నీ అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌లైన చెప్పారు మింత్రా - జబాంగ్‌ సీఈవో అనంత్‌ నారాయణన్‌. 

55 శాతం అబ్బాయిలే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇండియా టుడే యూత్‌ సమిట్‌ మైండ్‌ రాక్స్‌లో నారాయణన్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. అ‍బ్బాయిలే ఎక్కువ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి కారణం, అమ్మాయిల కంటే ఎక్కువగా వారి వద్దే స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉండటమని మింత్రా సీఈఓ అనంత్ నారాయణన్ పేర్కొన్నారు. షాపర్‌ పరంగా చూసుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే వారి పరిమాణం పెరుగుతోంది. 

అయినా అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే షాపర్స్‌ను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణదారులకు ఎలాంటి తేడా లేదని, గ్రామీణ వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తులు, పట్టణ వినియోగదారులు తీసుకునేవి సమానంగా ఉన్నాయని మింత్రా సీఈవో తెలిపారు. 

మింత్రాలో 55 శాతం డిమాండ్‌ టాప్‌ 30 నగరాలను మించి వస్తుందని, మిగతా 45 శాతం టాప్‌ 30 నగరాల నుంచి వెల్లువెత్తుందని చెప్పారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో యాక్సస్‌ లేదు, ఒకవేళ యాక్సస్‌ కల్పిస్తే, పట్టణ వాసులు అనుసరించే ట్రెండ్‌నే గ్రామీణులు అనుసరిస్తారని పేర్కొన్నారు. గ్లోబల్‌ ట్రెండ్స్‌ భారత్‌కు చాలా వేగంగా విస్తరిస్తాయని, భారతీయులు సరసమైన లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పారు.