Asianet News TeluguAsianet News Telugu

బాయ్ కాట్ అమెజాన్!! డోర్ మాట్లపై గణేశ్ చిత్రాలు.. ఫుల్‌గా ట్రోలింగ్

అమెజాన్ సంస్థ మరోసారి వివాదంలో చిక్కుకొంది. హిందూ దేవాలయాల బొమ్మలను కాలికింద వేసుకొనే డోర్ మ్యాట్లపై ముద్రించి విక్రయిస్తున్నారు. 

BoycottAmazon trends on Twitter after website sells rugs with images of Lord Ganesha, Indian flag
Author
New Delhi, First Published Jan 12, 2020, 11:53 AM IST

న్యూఢిల్లీ: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే డోర్ మ్యాట్లు, కప్పుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌. దీంతో భారత వినియోగదారులు అమెజాన్‌ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు.

దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్‌ అమెజాన్‌ అనేది ట్రెండింగ్‌లో నిలిచింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్‌ దర్శనమిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్‌ కనిపించాయి. 

BoycottAmazon trends on Twitter after website sells rugs with images of Lord Ganesha, Indian flag


దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు. ‘సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజన్లు ఘాటుగా విమర్శించారు. 

‘మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం’ అని నెటిజన్లు పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్‌లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్‌ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్‌సైట్‌ నుంచి తొలగింది.

కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.

మతపరమైన భావోద్వేగాలతో అమెజాన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2019 మేలోనూ హిందూ దేవుళ్ల ఫోటోలు ముద్రించిన అమెజాన్ టాయిలెట్ సీట్ కవర్లు, మ్యాట్లను తన వెబ్ సైట్ లో విక్రయానికి పెట్టింది. అంతకుముందు 2017లో అమెజాన్ కెనడా వెబ్ సైట్ లో త్రివర్ణ పతాకం ముద్రించిన డోర్ మ్యాట్లను తయారు చేసి విమర్శల పాలైంది

Follow Us:
Download App:
  • android
  • ios