దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి 2016 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ డీమోనిటైజేషన్ ప్రకటించారు. ఒక సర్వే ప్రకారం, కరోనా కాలంలోనే డిజిటల్ ఇండియా ఊపందుకుంది.

కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో నగదు చెల్లింపుదారుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. దీనికి ప్రధాన కారణం కోవిడ్ -19 వ్యాప్తి. లాక్ డౌన్ తర్వాత ప్రజలు ఆహారం, మేడిసిన్స్, బట్టలు అవసరమైన వస్తువుల కొనుగోళ్లకు ఆన్‌లైన్ పేమెంట్ ద్వారానే చెల్లిస్తున్నారు.

దేశంలోని 300 జిల్లాల నుండి 15 వేల మంది ప్రజల ఆధారంగా లోకల్ సర్కిల్ నివేదిక 2020లో నెలవారీ కొనుగోళ్లు చేసే వారి సంఖ్య 50 శాతం తగ్గిందని చెప్పారు. 2020లో 14 శాతం మంది ప్రజలు నెలవారీ కొనుగోళ్లలో సగటున '50 -100 శాతం'  ఆన్ లైన్ పేమెంట్ ఉపయోగిస్తున్నారు, ఇది 2019లో 27 శాతంగా ఉంది.

also read ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళాల జాబితాలో ఇషా అంబానీ కి చోటు.. ...

దీని ద్వారా నగదు చెల్లింపులు 50 శాతం తగ్గిందని సూచిస్తుంది. ఈ సర్వేలో డిజిటల్ లావాదేవీలు పెరగడమే కాకుండా వివిధ రకాల లావాదేవీలలో డిజిటల్ మోడ్‌లు అవలంబించాయని కనుగొన్నారు.

సర్వేలో పాల్గొన్న వారు జీతం చెల్లించడానికి, వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులు ఆహారానికి మాత్రమే నగదును ఉపయోగిస్తారని చెప్పారు. సర్వేలో కేవలం 3 శాతం మంది మాత్రమే అద్దె చెల్లించడానికి, వస్తువులను కొనడానికి లేదా ఇంటిని రిపేర్ చేయడానికి మాత్రమే నగదును ఉపయోగించారని తెలిపింది.

7 శాతం మంది ప్రజలు నగదు రూపంలో 'లంచం' తీసుకున్నారని నివేదికలో పేర్కొంది. లోకల్ సర్కిల్ ప్రెసిడెంట్ సచిన్ టాపారియా మాట్లాడుతూ, 'భారతదేశంలో డిజిటల్ పేమెంట్ వాడకంలో విపరీతమైన వృద్ధిని కనబరిచింది, చివరికి వినియోగదారుల కొనుగోళ్లకు సంబంధించి వారు డిజిటల్ పేమెంట్ వైపుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు' అని అన్నారు.