బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబిత ప్రకారం రిలయన్స్‌ టెలికాం దిగ్గజం, బిలియనీర్ ముఖేష్ అంబానీ (63) ఇప్పుడు ప్రపంచంలో ఐదవ ధనవంతుడి స్థానం దక్కించుకున్నాడు.

తద్వారా దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌లను వెనక్కి నెట్టేశారు. ఆయిల్-టు-టెలికాం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, అమెరికన్ పెట్టుబడిదారుడు వారెన్ బఫ్ఫెట్‌ను అధిగమించి ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకింగ్‌లో ఐదవ స్థానంలో నిలిచాడు.

ముకేష్ అంబానీ సంపద 75 బిలియన్ డాలర్లు (రూ. 5.61 లక్షల కోట్లు) . సంపదలో ముకేష్ అంబానీ, ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ దగ్గర ఉన్నారు,  ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ సంపద 89 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఏకైక ఆసియా వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ కావడం విశేషం.

also read ఇండియాలో పెట్టుబడులు పెట్టండి.. అమెరికా కంపెనీలకు ప్రధాని పిలుపు ...

ఈ జాబితాలో 185.8 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ టాప్ టాప్‌ ప్లేస్‌లో ఉండగా, 113.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మూడో స్థానంలో లగ్జరీ గూడ్స్ ఎల్‌వీహెచ్‌ బ్రాండ్ మోయిట్ హెన్నెస్సీ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది.

89 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్, ఆరో స్థానంలో వారెన్ బఫెట్, ఏడో స్థానంలో ఒరాకిల్ కార్పొరేషన్ ఫౌండర్ లార్రీ ఎల్లిసన్, ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్, పదో స్థానంలో గూగుల్ కోఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు.