Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు కంపెనీ సి‌ఈ‌ఓ ఊహించని సప్రైజ్.. ఏకంగా ఫ్లయిట్ టిక్కెట్లు, భోజన ఖర్చులతో సహ..

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కెన్ గ్రిఫిన్ తన సిబ్బందితో "మనము మన చరిత్రలోనే కాదు, ఆర్థిక చరిత్రలో కూడా అత్యంత ఎక్స్ట్రడినరీ టీంను నిర్మించాము. మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది." అని అన్నారు.
 

Billionaire CEO arranges for 3-day Disneyland trip for 10,000 staff and their families
Author
First Published Dec 9, 2022, 11:37 AM IST

గంటల కొద్దీ కష్టపడి మీరు 'ఎంప్లాయి ఆఫ్ ది ఇయర్' కాఫీ మగ్‌తో చాలా హ్యాపీగా ఉన్నట్లయితే, ఈ బిలియనీర్ బాస్  ఉద్యోగుల పట్ల కృతజ్ఞతలు తెలిపే విధానం మిమ్మల్ని కొంచెం అసూయపడేలా చేస్తుంది.  ఏంటంటే సిటాడెల్ సి‌ఈ‌ఓ అండ్ ఫౌండేర్ కెన్ గ్రిఫిన్ అతని కంపెనీలో పనిచేసే 10,000 మంది సిబ్బంది  అలాగే వారి ఫ్యామిలీ కోసం డిస్నీల్యాండ్ ఫ్లోరిడాకు మూడు రోజుల టూర్ వెళ్ళేందుకు ఖర్చులను చెల్లించాడు.  దీంతో ఈ సంవత్సరానికి కెన్ గ్రిఫిన్ 'కూల్ బాస్' అవార్డు కూడా గెలుచుకున్నారు.

అంతే కాదు! న్యూయార్క్, హ్యూస్టన్, పారిస్, జ్యూరిచ్ ఇంకా ఇతర నగరాల్లో ఉన్న ఉద్యోగులందరి విమాన టిక్కెట్ల ఖర్చు  ఇంకా వారికి భోజనం ఇతర సౌకర్యాల కోసం కూడా అతనే చెల్లించేలా చూసుకున్నాడు. మీరు సిటాడెల్‌లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లయితే, ఇక్కడ మరొక ఛాన్స్ ఉంది.  కెన్ గ్రిఫిన్ డిస్నీల్యాండ్‌లో అతని సిబ్బంది కోసం కోల్డ్‌ప్లే అండ్ కార్లీ రే జెప్‌సెన్ మ్యూజిక్ కాన్సెర్ట్  కూడా ఏర్పాటు చేశాడు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కెన్ గ్రిఫిన్ తన సిబ్బందితో "మనము మన చరిత్రలోనే కాదు, ఆర్థిక చరిత్రలో కూడా అత్యంత ఎక్స్ట్రడినరీ టీంను నిర్మించాము. మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది." అని అన్నారు.

కెన్ గ్రిఫిన్ $31.7 బిలియన్ల అంటే 3 వేల కోట్లకు పైగా  నికర విలువతో హెడ్జ్ ఫండ్ వ్యాపారంలో సక్సెస్ ఫుల్ వ్యక్తి. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 40వ స్థానంలో నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios