వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారిని బిల్ గేట్స్ సృష్టించినట్లు ఆన్‌లైన్‌లో వస్తున్న పోస్టులకు వ్యతిరేకంగా బిలియనీర్ బిల్ గేట్స్ గురువారం స్పందించారు. "కరోనా వైరస్ మహమ్మారి, సోషల్ మీడియా, ప్రజల కలయిక ఒక బ్యాడ్ కాంబినేషన్ " అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

బిల్ గేట్స్‌ను లక్ష్యంగా చేసుకుని కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్‌లైన్‌లో కొందరు రూపొందించిన డాక్టరు ఫోటోలు, కల్పిత వార్తా కథనాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ యాప్స్, వివిధ భాషలలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

also read జియోమార్ట్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్‌ చర్చలు..? ...

వాక్సిన్, ఎలక్ట్రానిక్ మైక్రోచిప్‌ల ద్వారా "జనాభాలో 15 శాతం మందిని తొలగించాలని" గేట్స్ కోరుకుంటున్నట్లు ఆరోపించిన ఒక వీడియో యూట్యూబ్‌లో  మిలియన్ల వ్యూస్ సంపాదించింది. "మా ఫౌండేషన్ కరోనా వైరస్ నుండి ప్రజల ప్రాణాలను కాపాడటానికి వ్యాక్సిన్లను  తయారు చేయడానికి ఎక్కువ డబ్బు ఇచ్చింది" అని గేట్స్ తన ఫౌండేషన్ గురించి ప్రస్తావించారు.

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి అతను 250 మిలియన్లను ఇవ్వడానికి సిద్దమని తెలిపాడు. అతని ఫౌండేషన్ గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

వ్యాక్సిన్ త‌యారీ కోసం వైర‌స్‌ను బిల్ గేట్స్ పుట్టించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వైరల్ ఆవుతున్నాయి. బ‌యోలాజిక‌ల్ టెర్ర‌రిజం కేసులో గేట్స్‌ను ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన‌ట్లు కూడా కొన్ని పోస్టులు సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి. వ్యాక్సిన్ త‌యారీ నుంచి డ‌బ్బు సంపాదించేందుకు గేట్స్ వైర‌స్‌ను సృష్టించిన‌ట్లు కొంద‌రు ఆరోపించారు.