జియోమార్ట్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్‌ చర్చలు..?

టెలివిజన్ చానల్, సోషల్ మీడియాలో వచ్చిన ట్వీట్ల ప్రకారం జియోమార్ట్ కోసం రిలయన్స్ రిటైల్ లో వాటాను కొనుగోలుకు వ్యూహాత్మక  చర్చలు చేసేందుకు  అమెజాన్  చూస్తోందని వెల్ల్దించింది.

Amazon in talks to buy 9.9% stake in Reliance retail arm ?

బెంగళూరు:  భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిటైల్ విభాగంలో 9.9% వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్.కామ్ ఇంక్ చర్చలు జరుపుతున్నట్లు ఒక వార్తా పత్రిక నివేదించింది.

టెలివిజన్ చానల్, సోషల్ మీడియాలో కనిపించిన ట్వీట్ల ప్రకారం జియోమార్ట్ కోసం రిలయన్స్ రిటైల్ లో వ్యూహాత్మక వాటాను అమెజాన్ కొనుగోలు చేసేందుకు  చర్చలు చేస్తోందని వెల్లడించింది.

రిలయన్స్  రిటైల్ ఆర్మ్ ఇ-కామర్స్ వెంచర్ అయిన జియోమార్ట్ మే నెలలో ప్రారంభించారు. అమెజాన్.కామ్ స్థానిక యూనిట్ వాల్ మార్ట్ ఇంక్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇండియాలోకి  ఆరంగేట్రం చేయాలని చూస్తోంది.

also read వరల్డ్ టాప్ 10 సంపన్నులలో ముకేశ్ అంబానీ... ...

ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధించడానికి భారతదేశం విధించిన లాక్ డౌన్  తరువాత అమెజాన్ ఇండియా తన వేదికపై చిన్న స్థానిక దుకాణాలను చేర్చడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇప్పటికే జియోమార్ట్‌ తన కొనుగోలుదార్లు వాట్సప్‌ ద్వారా ఆర్డర్లు పెట్టడానికి వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి నవీ ముంబయి, థానే, కల్యాణ్‌ వంటి ఎంపిక చేసిన ప్రాంతాలకే దీనిని పరిమితం చేసింది.

త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనుంది. అయితే ఈ అంశం స్పందించేందుకు ఇరు కంపెనీల అధికార ప్రతినిధులు నిరాకరించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios