Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ కొనేసిన ఎలాన్ మస్క్ కు భారీ షాక్, రోజుకు రూ. 2500 కోట్ల నష్టంతో తరిగిపోతున్న సంపద..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి  సందడి చేశారు. అంతేకాదు ట్విట్టర్ సీఈఓతో సహా చాలా మంది ఉద్యోగులను తొలగించారు. అయితే ట్విటర్‌ను కొనుగోలు సంబరాలు చేసుకుంటున్న మస్క్‌కి ఒక షాక్ తగిలింది. 2022లో మస్క్ ప్రతిరోజూ 2,500 కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Big shock to Elon Musk who bought Twitter, Rs. Declining wealth with loss of 2500 crores
Author
First Published Nov 23, 2022, 10:43 PM IST

వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్ కొనుగోలు తర్వాత నుంచి మస్క్ చిత్ర విచిత్ర ట్వీట్ లతో  టెక్ ప్రపంచంలో తన ముద్ర వేసుకుంటున్నాడు. ట్విట్టర్  కొనుగోలు అనంతరం సీఈవో పరాగ్ అగర్వాల్ సహా వేలాది మంది ఉద్యోగులను ట్విట్టర్ సంస్థ నుంచి తొలగించి తీవ్ర సంచలనం సృష్టించారు. 

అయితే ట్విటర్ ను రీసెట్ చేస్తానంటూ వచ్చిన మస్క్, ఆ పనిలో పడి అసలు పని మరిచిపోయారనే విమర్శలు వస్తున్నాయి,  ఎలోన్ మస్క్ జనవరి 2022 నుండి 100 బిలియన్ యుఎస్ డాలర్లను కోల్పోయాడు. అంటే మస్క్ ప్రతిరోజూ భారతీయ రూపాయలలో చూస్తే రూ. 2,500 కోట్ల రూపాయలను కోల్పోయినట్లు నిపుణులు చెబుతున్నారు. 

ట్విట్టర్ కొనుగోలు తర్వాత టెస్లా కంపెనీ షేర్లు దిగువకు పడిపోయాయి. టెస్లా , స్టాక్ గత రెండు సంవత్సరాలలో పెరుగుదలను చూసింది. కానీ ట్విటర్ కొనుగోలు, గందరగోళం , గ్రాఫ్ట్ కారణంగా టెస్లా షేర్లు భారీ క్షీణతను చవిచూశాయి. ట్విట్టర్ కొనుగోలు కాకుండా, టెస్లా స్టాక్ క్షీణతకు కొన్ని ఇతర కారణాలు దారితీశాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారి ఎలాన్ మస్క్ జేబుకు చిల్లు పడింది.

బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం, గత ఏడాది ఎలాన్ మస్క్ నికర ఆదాయం 340 బిలియన్ అమెరికన్ డాలర్లు. కానీ ఈ సంవత్సరం, మస్క్ నికర ఆదాయం 100 బిలియన్లకు పైగా పడిపోయింది. ఈ నెలలో విడుదలైన గణాంకాల ప్రకారం, ఎలాన్ మస్క్ నికర ఆదాయం 170 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. 

బ్లూటిక్ కోసం ఇఫ్పటికే 8 డాలర్లు (సుమారు రూ. 660) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ కొత్త యజమాని ఎలోన్ మస్క్ ప్రకటించారు. దీంతో ట్విటర్‌ వినియోగదారుల ఆగ్రహానికి గురయ్యారు. బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు' మస్క్ ట్వీట్ చేశాడు. దేశ ప్రజల కొనుగోలు శక్తి సమానత్వాన్ని బట్టి ధరను కూడా సర్దుబాటు చేస్తామని చెప్పారు.

మస్క్ నిర్ణయంపై ట్విట్టర్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ట్విటర్ కేవలం యాడ్ రాబడిపైనే ఆధారపడదని మస్క్ తేల్చి చెప్పేశాడు. 

3.6 లక్షల కోట్లతో ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్.. సీఈవో పరాగ్ తో సహా పలువురు సీనియర్లను తొలగించిన తర్వాత మొత్తం సిబ్బందిలో 75% మందిని తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios