మర్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ భారత్‌పే సేఫ్‌గోల్డ్ సహకారంతో వ్యాపారుల కోసం డిజిటల్ గోల్డ్ ప్రాడక్ట్ ను మంగళవారం ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సేఫ్‌గోల్డ్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఇది వినియోగదారులకు 24 గంటలు బంగారాన్ని కొనేందుకు, అమ్మేందుకు, డెలివరీ చేసేందుకు అవకాశం లభిస్తుంది.

భారత్‌పేలో డిజిటల్ గోల్డ్ ప్రవేశపెట్టడంతో వ్యాపారులకు ఆర్థిక ఉత్పత్తులు పూర్తిగా అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. "మా ప్లాట్‌ఫామ్‌లో బంగారాన్ని ప్రారంభించాలని వ్యాపారుల నుండి మాకు చాలా అభ్యర్ధనలు వచ్చాయి.

మేము ఇప్పటికే గొప్ప స్పందన చూస్తున్నాము, ప్రారంభించిన రోజున 200 గ్రాముల బంగారాన్ని విక్రయించాము" అని భరత్‌పే గ్రూప్ ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ చెప్పారు.

also read దీపావళి గిఫ్ట్ : నవంబర్‌ 5లోగా లోన్ కస్టమర్లకు క్యాష్ ‌బ్యాక్‌.. ...

" భవిష్యత్తులో డిజిటల్‌ బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని వచ్చే ఆర్థిక సంవత్సరం 30 కిలోల బంగారం విక్రయించాలని, దీపావళి నాటికి కనీసం 6 కిలోలు బంగారం అమ్మాలని  లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ఆయన చెప్పారు.

భారత్‌పే యాప్‌ను ఉపయోగించడం ద్వారా వ్యాపారులు 99.5 శాతం స్వచ్ఛత, 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసి విక్రయించడానికి అలాగే  రోజులో ఏ సమయంలోనైనా, ఎక్కడి నుండైనా రూపాయి లేదా గ్రాములలో కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

వ్యాపారులు కొనుగోలు చేసిన బంగారం సంబంధించి బంగారం రక్షణకు సేఫ్‌గోల్డ్‌ ఐడిబిఐ ట్రస్టీషిప్‌ సేవలను నియమించింది. కొనుగోలు చేసిన బంగారాన్ని అదనపు ఖర్చు లేకుండా సేఫ్‌గోల్డ్‌ తో 100 శాతం బీమాతో లాకర్ల సురక్షితంగా ఉంచుతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉన్న బంగారం ధరల గురించి వ్యాపారులకు రియల్‌టైం వ్యూ అందుతుందని వారు కొనుగోలు చేసే బంగారానికి జీఎస్‌టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ కూడా లభిస్తుందని సమీర్‌ వివరించారు. క్రెడిట్ కోసం భారత్ పే రిజిస్టర్డ్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ తో  బంగారాన్ని అమ్మవచ్చు అని భరత్ పే తెలిపింది.