Asianet News TeluguAsianet News Telugu

పండగ సీజన్ ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి బ్యాంకింగ్ మోసాల గురించి తెలుసుకోండి..

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగ చాలా మంది ఆన్‌లైన్ పేమెంట్లు, ఫోన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకోసారి ఇంటర్నెట్‌ను ఉపయోగించి కూడా హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయవచ్చు.

Beware of banking frauds this festive season online payments, know how you can stay safe
Author
Hyderabad, First Published Nov 6, 2020, 1:53 PM IST

 పండుగ సీజన్ లో బ్యాంకింగ్ మోసాలు సాధారణం. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ పేమెంట్లు, లావాదేవీలు చేసేది ఇలాంటి సమయంలోనే ఎక్కువ. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగ చాలా మంది ఆన్‌లైన్ పేమెంట్లు, ఫోన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకోసారి ఇంటర్నెట్‌ను ఉపయోగించి కూడా హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు రకాల బ్యాంకింగ్ మోసాల గురించి ప్రజలను హెచ్చరిస్తుంది. ఈ రకమైన మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సలహా ఇస్తుంది.

6 రకాల వేర్వేరు బ్యాంకింగ్ మోసాలు:

క్యూఆర్‌ కోడ్ మోసాలు 
క్యూఆర్‌ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్ధం. క్యూఆర్‌ కోడ్ అనేది ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే పద్దతి. హ్యాకర్లు ఇలాంటి క్యూఆర్‌ కోడ్లను లింక్‌ లాగా సృష్టించి ఫోన్ నంబర్లను పంపిస్తుంటారు. ఎవరైనా అలాంటి లింకులపై క్లిక్ చేస్తే అప్పుడు హ్యాకర్లు వారి బ్యాంక్ ఖాతా నుండి డబ్బును కొట్టేస్తారు.

యుపిఐ లింక్ మోసాలు 
చాలా మంది ప్రజలు యుపిఐ లావాదేవీలను ఆశ్రయిస్తారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ చేయడానికి ఇది చాలా సురక్షితమైన మార్గం అయినప్పటికీ, హ్యాకర్లు ప్రజలను మోసం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. హ్యాకర్లు పంపించే  యుపిఐ లింక్‌పై క్లిక్ చేసి పిన్‌ ఎంటర్ చేస్తే వారి అక్కౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. ఇలాంటి మోసాలను నివారించలంటే తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండటం మంచిది.

also read వీధికుక్కలపై రతన్ టాటా ప్రేమ.. వీటికోసం ప్రత్యేకమైన భవనం, తాజ్ హోటల్ నుండి మాంసం కూడా.. ...

ఏ‌టి‌ఎం కార్డ్ స్కిమ్మింగ్
ఏ‌టి‌ఎం కార్డ్ స్కిమ్మింగ్ ద్వారా హ్యాకర్లు కార్డ్ డేటాను దొంగిలించవచ్చు, ఏ‌టి‌ఎం కార్డ్ రీడర్ స్లాట్‌లో ఒక డివైజ్ ఉంచడం ద్వారా హ్యాకర్లు వినియోగదారుల డేటాను సేకరిస్తారు. అంతేకాదు చాలా మంది ఏ‌టి‌ఎంలలో నకిలీ కీబోర్డుల ద్వారా కూడా డేటాను కొట్టేస్తారు. కాబట్టి ఏకాంత ప్రదేశాలలో ఉన్న ఏ ఏ‌టి‌ఎం నుండి లావాదేవీలు చేయవద్దు, బ్యాంక్ బ్రాంచ్ లోపాల్ ఉన్న ఏ‌టి‌ఎం వద్ద లేదా రద్దీగా ఉన్న ఏ‌టి‌ఎంలను మాత్రమే వాడండి.

బ్యాంక్ ఖాతా చెకింగ్  మోసాలు 
హ్యాకర్లు ఏదైనా ఒక బ్యాంకు నుండి కాల్స్ చేయడం ద్వారా ప్రజలను మోసం చేయవచ్చు. మీరు మీ బ్యాంక్ ఖాతాల వివరాలను ఒకవేళ వారికి తెలిపితే వారు మీ డబ్బును దోచుకునే ప్రమాదం ఉంది. కస్టమర్లందరూ వారి బ్యాంక్ ఖాతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. అలాగే వారికి తెలియకుండా ఏదైనా లావాదేవీలు చూసినట్లయితే, వారు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.


క్రెడిట్ / డెబిట్ కార్డ్ క్లోనింగ్
ఎటిఎం స్కిమ్మింగ్ లాగా ఇది కూడా ఒక రకమైన మోసం. దీని ద్వారా కార్డు నుండి మొత్తం సమాచారాన్ని తీసుకున్న తరువాత, నకిలీ కార్డు తయారు చేసి వారి ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేస్తారు. 

వాట్సాప్ ఫెక్ కాల్స్
ఈ రోజుల్లో హ్యాకర్లు వాట్సాప్ ద్వారా కూడా ఫెక్ కాల్స్ చేస్తున్నారు. తెలియని నంబర్ నుండి అటువంటి కాల్ వచ్చిన వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి. లేదంటే మిమ్మల్ని మోసగించి మీ డబ్బు కొట్టేసే ప్రమాదం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios