Asianet News TeluguAsianet News Telugu

మౌలిక సదుపాయాల వృద్ధి వ్యాపార అవకాశాలు, ఉద్యోగాలను సృష్టిస్తుంది: ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల వృద్ధి వ్యాపార అవకాశాలు, ఉద్యోగాలను సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి అద్భుతమైన సామర్థ్యం ఉంది.

Beti Subhash Reddy, MLA garu at Excel Real YouTube channel launch at Peerzadiguda on March 30, Tuesday
Author
Hyderabad, First Published Mar 30, 2021, 4:50 PM IST

మార్చి 30 హైదరాబాద్: పీర్జాడిగుడలో నేడు  ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానల్ ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి  లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "హైదరాబాద్ నగరానికి తూర్పు, ఉత్తరం వైపు అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ చాలా కృషి చేస్తున్నారు. భవనం లేఅవుట్ల మంజూరు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం సింప్లిఫైడ్ విధానాలను కలిగి ఉంది.

పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల వృద్ధి వ్యాపార అవకాశాలు, ఉద్యోగాలను సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. మౌలిక సదుపాయాల రంగాన్ని ప్రోత్సహించినందుకు ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానెల్‌ని నేను అభినందిస్తున్నాను" అని అన్నారు.

తూర్పు, ఉత్తర హైదరాబాద్ వాణిజ్య, నివాస ప్రాంతాల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పీర్జాడిగుడ మేయర్ జె వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎక్సెల్ ఇండియా న్యూస్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్, ఎక్సెల్ రియల్ యూట్యూబ్ ఛానల్ హెడ్ ఎస్ రామ కృష్ణ కూడా ఇందులో పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios