బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా...అయితే దేంట్లో ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసా...
పెట్టుబడులపై ఎలాంటి రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ. అయితే రిటర్న్స్ కూడా తక్కువే అయినా కానీ తమ డబ్బులు సురక్షితంగా ఉండాలన్న ఆలోచనతో ఎక్కువ మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు.
ఉద్యోగం చేస్తూ ఎంతోకొంత వచ్చిన సంపాదనలో పొదుపు చేయాలని చాలామంది అనుకుంటుంటారు, ఇందుకోసం అన్నీ బ్యాంకుల్లో సంప్రదించి ఎక్కువ వడ్డీ దెంట్లో వస్తుందో తేలుసుకొని అందులో పొదుపు ఫిక్సెడ్ డిపాజిట్ చేసి పొదుపు చేస్తుంటారు.
ఒకవేళ మీ దగ్గర పొదుపు ప్రతినెలా పొదుపు చేయడానికి డబ్బులు ఉన్నాయా? వాటిపై ఎక్కువ వడ్డీ పొందాలనుకుంటున్నారా అయితే ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసం ఈ సమాచారం...
పెట్టుబడులపై ఎలాంటి రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ. అయితే రిటర్న్స్ కూడా తక్కువే అయినా కానీ తమ డబ్బులు సురక్షితంగా ఉండాలన్న ఆలోచనతో ఎక్కువ మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు.
ఇటీవలీ కాలంలో బ్యాంకులు వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనా వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు వచ్చే లాభం కూడా తగ్గుతుంది. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు 8% కన్నా ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏవో ఒకసారి తెలుసుకోండి.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 36 నెలల 1 రోజు నుంచి 42 నెలల వరకు 9.00% నుంచి 9.50% వరకు వద్దిని ఇస్తున్నాయి.
also read కరోనా ఎఫెక్ట్: ఫ్రీ ఇంటర్నెట్ డాటా, ఆన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్...
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1555 రోజులకు 8.25% నుంచి 8.75% వరకు, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 777 రోజులకు 9.00% నుంచి 9.50% వరకు , ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 888 రోజులకు 8.25% నుంచి 9.85% వరకు , డీసీబీ బ్యాంక్‌లో 36 నెలలకు 7.70% నుంచి 8.00% వరకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో 500 రోజులకు 7.50% నుంచి 8.20% వరకు, ఆర్‌బీఎల్ బ్యాంకులో 24 నెలల నుంచి 36 నెలల డిపాజిట్లకు 7.45% నుంచి 8.00% వరకు వడ్డిని ఇస్తున్నాయి.
ఇక కేంద్ర ప్రభుత్వం రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్-డిఐసిజిసి బీమా కవర్ ఇస్తుంది. అంటే ఒక వేళ బ్యాంకు దివాళా తీసినా మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.5,00,000 వరకు ఇన్స్యూరెన్స్ పొందొచ్చు.
ఇక కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటాయి. అయితే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం బ్యాంకును ఎంచుకునే ముందు ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని బ్యాంకును సెలెక్ట్ చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఇటీవల యెస్ బ్యాంక్ సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే.
అందుకే బ్యాంకు నిర్వహణలో సమస్యలు ఉంటే ఇలాంటి సంక్షోభాలు రావొచ్చు. అందుకోసం ముందుగానే ఎంచుకున్న బ్యాంకుపై పూర్తి సమాచారం తెలుసుకొని డబ్బులు డిపాజిట్ చేయడం చాలా ఉత్తమం అని విశ్లేషకులు చెబుతున్నారు.