Top Drone maker companies:  డ్రోన్‌ టెక్నాలజీకి ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం డ్రోన్‌లను అన్ని రంగాల్లోనూ విసృత్తంగా వినియోగిస్తున్నారు. మరి డ్రోన్లను తయారు చేసే కంపెనీలు మదుపుదారులకు సిరులు కురిపించే చాన్స్ ఉంది. ఆ కంపెనీలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే చాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ప్రతి రంగంలోనూ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డ్రోన్ల వినియోగంలో గతంలో మాదిరిగా కఠినంగా నిబంధనలు పాటించకపోవడానికి ఇదే కారణం. కొంతకాలంగా డ్రోన్ తయారీ కంపెనీలు సైతం హై స్పీడ్ తో వృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో మంచి లాభాలు ఆర్జించగల కంపెనీల గురించి తెలుసుకుందాం. తద్వారా మదుపరులు డ్రోన్లు తయారు చేసే కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేసే వీలుంటుంది. 

రత్తన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్: (RattanIndia Enterprises) 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంపెనీ షేర్లు దాని పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇస్తున్నాయి. నివేదికల ప్రకారం, గత ఏడాది నుండి, పెట్టుబడిదారులు ఇందులో మంచి రాబడిని పొందుతున్నారు. 1 సంవత్సరంలో, ఈ స్టాక్ సుమారు 200 శాతం పెరిగింది. కొన్ని రోజుల క్రితం థ్రోటల్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం వాటాను కంపెనీ తీసుకుంది. గత వారంలో ఈ షేరు దాదాపు 35 శాతం లాభపడింది.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్: (Bharat Electronics Ltd) :
 భారత్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడిదారులకు లాభదాయకమైన స్టాక్ కావచ్చు. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో షేరు 6.21 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 65 శాతం రాబడిని ఇచ్చింది.

డీసీఎం శ్రీరామ్: (DCM Shriram) :
డీసీఎం శ్రీరామ్ షేర్లు కూడా తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి. ఈ స్టాక్ బుల్లిష్‌గా కొనసాగుతోంది. ప్రతి రంగంలో డ్రోన్‌ల వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో స్టాక్ ఇన్వెస్టర్లకు లాభదాయకమైన డీల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.