Asianet News TeluguAsianet News Telugu

దీపావళికి ముందు పెట్రోల్, డీజిల్‌ ధరలపై బిగ్ రిలీఫ్ ! నేడు లీటరు ధర ఎంతంటే..?

గత ఐదు నెలలుగా చమురు కంపెనీలు దేశీయ మార్కెట్‌లో పెట్రోల్-డీజిల్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. 22 మే 2022న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా  ఇంధన ధరలపై కేంద్రం సామాన్యులకు ఉపశమనం కలిగించింది.

Before Diwali oil companies gave big relief in petrol and diesel! Crude volatility continues
Author
First Published Oct 20, 2022, 9:06 AM IST

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలో అస్థిరత నెలకొంది. ఒకప్పుడు క్రూడయిల్ 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే ఆ తర్వాత ఒపెక్ దేశాల ఉత్పత్తి తగ్గింపు నిర్ణయంతో మళ్లీ ముడిచమురు ధర పెరిగింది.

గత ఐదు నెలలుగా చమురు కంపెనీలు దేశీయ మార్కెట్‌లో పెట్రోల్-డీజిల్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. 22 మే 2022న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా  ఇంధన ధరలపై కేంద్రం సామాన్యులకు ఉపశమనం కలిగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.5 తగ్గింది. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించడం ద్వారా వాహనదారులకు ఉపశమనం కలిగించాయి.

క్రూడాయిల్ తాజా ధర 
గురువారం ఉదయం WTI క్రూడాయిల్ $ 85.89 వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $ 92.26 వద్ద ఉంది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా ప్రతిరోజూ చమురు ధరలను జారీ చేస్తాయి. పెట్రోలు, డీజిల్ ధరల్లో ఏదైనా మార్పు ఉంటే ఉదయం 6 గంటల నుంచి అమలు చేస్తారు. వివిధ రాష్ట్రాల VAT కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి.

అక్టోబర్ 20న పెట్రోలు-డీజిల్ ధరలు
- ఢిల్లీ పెట్రోల్ రూ. 96.72 & డీజిల్ రూ. 89.62 లీటర్‌కు
- ముంబై పెట్రోల్ రూ. 111.35 & డీజిల్ రూ. 97.28 లీటర్‌కు
- చెన్నై పెట్రోలు రూ. 102.63 & డీజిల్ రూ.94.24 లీటరుకు
- నోయిడాలో పెట్రోల్ రూ. 96.57 మరియు డీజిల్ రూ. 89.96
- లక్నోలో పెట్రోల్ రూ. 96.57, డీజిల్ లీటర్ రూ. 89.76
- జైపూర్‌లో పెట్రోల్ రూ. 108.48, డీజిల్ ధర రూ.93.72
-తిరువనంతపురంలో రూ.107.71, డీజిల్ ధర రూ.96.52 లీటరుకు
-పాట్నాలో పెట్రోల్ రూ. 107.24, డీజిల్ లీటరుకు రూ. 94.04
- గురుగ్రామ్‌లో రూ. 97.18, డీజిల్ లీటరుకు రూ. 90.05
- బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.94, డీజిల్‌ రూ.87.89
-భువనేశ్వర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.19, డీజిల్‌ రూ.94.76
-హైదరాబాద్‌లో రూ.109.66 డీజిల్‌ రూ.97.82.

ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

పెట్రోల్ డీజిల్ ధరలను మీరు SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP అండ్ సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్లు HPPrice అండ్ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios