Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబరులో బ్యాంకు సెలవులు ఇవే, బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

సెప్టెంబరులో బ్యాంకులకు 13 రోజులు సెలవు దినాలు ప్రకటించారు. అందుకే బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. 

Banks will be closed for 13 days in September see this list of holidays before leaving
Author
First Published Aug 26, 2022, 12:04 PM IST

సెప్టెంబరు నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 13 రోజుల పాటు బ్యాంకులకు ఆర్బీఐ సెలవలు ప్రకటించింది. ఇందులో రెండు ఆదివారాలు, రెండు శనివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సెలవుల క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్‌లో ఎనిమిది సెలవులు ఉన్నాయి.

సెప్టెంబరు నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 13 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్న నేపథ్యంలో మీ లావాదేవీలు లేదా మరేదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లడానికి ముందు సెలవుల జాబితాను తనిఖీ చేసుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే మీరు బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడవచ్చు. భారతదేశంలోని బ్యాంకులు నెలలోని అన్ని ఆదివారాలు, నెలలో రెండవ, నాల్గవ శనివారాలు మూసివేసి ఉంచుతారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ 2022లో బ్యాంక్ సెలవులు ఇవే..

సెప్టెంబర్ 1: పనాజీలో గణేష్ చతుర్థి (2వ రోజు) సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 
సెప్టెంబర్ 4: నెలలో మొదటి ఆదివారం.
సెప్టెంబర్ 6: కర్మ పూజ కారణంగా రాంచీలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 
సెప్టెంబర్ 7: మొదటి ఓనం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 
సెప్టెంబర్ 8: తిరువోణం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 
సెప్టెంబర్ 9: ఇంద్రజాత్ర కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 
సెప్టెంబర్ 10: శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో శనివారం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని బ్యాంకులు కూడా మూసివేయబడతాయి.
సెప్టెంబర్ 11: నెలలో రెండవ ఆదివారం.
సెప్టెంబర్ 18: నెలలో మూడవ ఆదివారం.
సెప్టెంబర్ 21: శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కొచ్చి , తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 
సెప్టెంబర్ 24: నెలలో నాలుగో శనివారం.
సెప్టెంబర్ 25: నెలలోని నాల్గవ ఆదివారం.
26 సెప్టెంబరు: నవరాత్రి స్థాపన/ మేరా చౌరేన్ హౌబా ఆఫ్ లానింగ్‌థౌ సన్మాహి సందర్భంగా ఇంఫాల్, జైపూర్‌లలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios