మీరు బ్యాంకుకి సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని చేయవలసి ఉంటే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపటినుంచి అంటే మార్చి 13 నుండి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు.

మార్చి 13 ఈ నెలలోని రెండవ శనివారం, మార్చి 14 ఆదివారం, కాబట్టి ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి. దీని తరువాత  మార్చి 15 సోమవారం, మార్చి 16 మంగళవారం  తేదీల్లో ప్రభుత్వ, గ్రామీణ బ్యాంకులు సమ్మె చేపట్టనున్నాయి. కాబట్టి మీకు ఏదైనా బ్యాంకింగ్ పని  ఉంటే ఈ రోజే దాన్ని పూర్తి చేసుకోండీ.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెబ్‌సైట్ ప్రకారం మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా అగర్తాలా, ఐజాల్, ఇంఫాల్, కోల్‌కతా, గ్యాంగ్‌టాక్, గువహతి, చెన్నై, న్యూ ఢీల్లీ, పాట్నా, పనాజీ, షిల్లాంగ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడ్డాయి.  

also read విడాకుల తరువాత రెండో పెళ్లి చేసుకున్నా అమెజాన్ సి‌ఈ‌ఓ మాజీ భార్య లైఫ్ స్టయిల్ ఎలా ఉందో తెలుసా ? ...

 బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా  ప్రభుత్వ, గ్రామీణ బ్యాంకులు సమ్మె  ప్రకటించాయి. దీంతో మార్చి 15, 16 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఫోరం సమ్మె నిర్వహించనున్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించారు. ఎల్‌ఐసిలో ఐడిబిఐ బ్యాంక్ వాటాను చాలావరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2019 సంవత్సరంలో విక్రయించింది. దీంతో గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ బ్యాంకులు విలీనం అయ్యాయి. 

యూ‌ఎఫ్‌బి‌యూలో  చేరిన తొమ్మిది పెద్ద సంఘాలు
యూ‌ఎఫ్‌బి‌యూ సభ్యులలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) ఉన్నాయి. ఇవి కాకుండా ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) ఉన్నాయి.