న్యూ ఢీల్లీ: మొబైల్ అండ్ ఇంటర్నెట్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ మార్చి నెలలో బ్యాంకింగ్ సంఘాలు  ప్రతిపాదిత సమ్మె కారణంగా  బ్యాంక్ శాఖలు మూసివేయనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి.

మార్చి 15 (సోమవారం), మార్చి 16 (మంగళవారం) న రెండు రోజుల సమ్మె కారణంగా బ్యాంకులు మూసివేయనున్నారు, అయితే మార్చి 13 రెండవ శనివారం కాగా, మార్చి 14 ఆదివారం. ఈ విధంగా బ్యాంకుల కార్యకలాపాలు వరుసగా నాలుగు రోజుల పాటు నిలిచిపోనున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కూడా మార్చి 2021 నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్న కొన్ని రోజులను పేర్కొన్నాయి. బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా నిర్దిష్ట సందర్భాల నోటిఫికేషన్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.

పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం మార్చి నెలలో 11 రోజులపాటు బ్యాంకు శాఖలు పనిచేయవు.స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు బ్యాంకు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి.

also read "మీరు ఎల్లప్పుడు కలిసి జీవించాలీ.. " వారి పెళ్లి రోజు సందర్భంగా టీనా అంబానీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ...

మార్చి 11వతేదీన మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి 22వతేదీన బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వరుస సెలవులతో బ్యాంకులను మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని బ్యాంకులు సూచించాయి.


మార్చి 2021 నెలలో  బ్యాంక్ సెలవుల జాబితా 
చాప్చర్ కుట్: మార్చి 5
మహాశివరాత్రి (మహా వాడ్ -13): మార్చి 11
బీహార్ దివాస్: మార్చి 22
హోలీ (రెండవ రోజు) - ధూలేటి / యోసాంగ్ 2వ రోజు: మార్చి 29
హోలీ: మార్చి 30

స్టేట్ డిక్లేర్డ్ హాలిడేస్ ప్రకారం పైన పేర్కొన్న ప్రాంతాలలలో సెలవులు విధించబడ్డాయి. అయితే గెజిటెడ్ సెలవులకు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.