భారతదేశంలోని అత్యంత ధనవంతుడు,  ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ,  నీత అంబానీల  36వ వివాహ వార్షికోత్సవం నేడు. అయితే ఈ సందర్భంగా అంబానీ జంటను  తరచుగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ వారికి  శుభాకాంక్షలు తెలిపారు.

టీనా అంబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె భర్త అనిల్ అంబానీ, ముకేష్ అంబానీ, నీతా అంబానీతో కలిసి నిలబడి ఉన్నా ఒక ఫోటోని షేర్ చేస్తూ ఒక  పోస్ట్ చేశారు.

also read వుమెన్స్ డే సందర్భంగా మహిళల కోసం ఒక కొత్త ప్లాట్‌ఫాం ఆవిష్కరించిన నీతా అంబానీ..

టీనా అంబానీ ఆ ఫోటోకి ఒక క్యాప్షన్‌ కూడా రాసింది. ఇందులో  'మీ దంపతులకు అభినందనలు తెలుపుతూ  ఒక వైపు మీరు తాతగా సంతోషకరమైన అనుభవాన్ని అనుభవిస్తు మరోవైపు  మీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆనందాన్ని ఇంకా మీరు ఎల్లప్పుడు  కలిసి జీవించాలని కోరుకుంటున్నాము. నీతా, ముకేష్ అంబానీలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ లో రాసింది.

గత సంవత్సరం డిసెంబర్ 10న నీతా, ముకేష్ అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ శ్లోక అంబానీకి కొడుకు జన్మించడంతో  వారు నానమ్మ, తాతయ్య అయ్యారు. కొడుకు పుట్టినట్లు ప్రకటించినప్పుడు 'శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో అలాగే ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ ఆశీర్వాదాలతో మాకు కొడుకు పుట్టినట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది అని  ఆకాష్ అంబానీ అన్నారు. నీతా, ముకేష్ అంబానీలకు 1985 లో వివాహం జరిగింది. ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు